వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron:దేశంలో మూడో ఒమిక్రాన్ కేసు.. ఎక్కడ అంటే.. ఆ దేశం నుంచి వచ్చాడంటే

|
Google Oneindia TeluguNews

దేశంలో మరో ఒమిక్రాన్ కేసు వచ్చింది. ఇప్పటికే బెంగళూరులో రెండు కేసులు రాగా.. తాజాగా గుజరాత్ జామ్‌నగర్‌లో ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ కేసు వచ్చింది. కొత్త వైరస్ దక్షిణాఫ్రికాలో వెలుగు చూడగా.. జెట్ స్పీడ్‌తో ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే 38 దేశాలకు వ్యాపించింది. జామ్ నగర్ వ్యక్తి కేసుతో దేశంలో ఒమిక్రాన్ కేసులు మూడుకు చేరాయి. భారత్‌కు ఒమిక్రాన్ భయం పట్టుకుంది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన ఒమిక్రాన్ బాధితుడు మిస్ అయి గుబులు పెడుతున్నాడు.

 జామ్ నగర్ రాక..

జామ్ నగర్ రాక..

గుజరాత్‌ జామ్‌నగర్‌‌కు చెందిన వ్యక్తి ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చారు. సదరు వ్యక్తి రెండు రోజుల క్రితం జింబాబ్వే నుంచి వచ్చాడు. విమానాశ్రయం వద్ద అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. వాటి ఫలితాలు రావటంతో సదరు వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్ర అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు.

తప్పుడు అడ్రస్

తప్పుడు అడ్రస్

విదేశాలనుంచి భారత్‌లో దిగిన కొందరి ఆచూకీ అధికారులకు లభించడం లేదు. అదీ సమస్యగా మారింది. వారి అడ్రస్ తప్పుగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇచ్చిన అడ్రస్‌లో కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో వైరస్‌ వ్యాప్తి చెందే ముప్పు పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేసులు పెరుగుతాయని వారు భావిస్తున్నారు.

టెన్షన్.. టెన్షన్...

టెన్షన్.. టెన్షన్...

ఇటు హైదరాబాద్‌లో దిగిన ఓ లండన్ యువతీ నమూనాలను కూడా జినొమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. రాజస్తాన్, మిగత చోట్ల కూడా అనుమానితులు ఉన్నారు. కానీ వారికి ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ నిర్ధారణ మాత్రం కాలేదు. ప్రస్తుతం ఉన్న మూడు కేసులు తగ్గితే సరిపోతుంది. కానీ వారి వల్ల ఇతరులకు వ్యాప్తి చెందితెనే ప్రమాదం.

 ఆరా..

ఆరా..

ఇటు సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకిన సంగతి తెలిసిందే. 66 ఏళ్ల వ్యక్తికి ట్రావెల్ హిస్టరీ ఉంది. అతను నవంబర్ 20వ తేదీన వచ్చారు. అప్పుడు నెగిటివ్ ఉండగా.. బెంగళూరు ఎయిర్ పోర్టులో పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. 22వ తేదీన జినొమ్‌కు పంపించగా.. 23వ తేదీన నెగిటివ్ వచ్చింది. అతను 24 మంది ప్రైమరీ, 240 సెకండరీ కాంటాక్ట్‌గా ఉన్నాయి. అతను దుబాయ్ ట్రావెల్ చేశాడు. అన్నీ ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వెతికీ మరీ పరీక్షలను చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వచ్చిన వారికి స్వల్పంగా లక్షణాలు ఉన్నాయని.. అందరూ రెండు టీకాలు తీసుకున్నారని వివరించారు.

English summary
person who travelled from Zimbabwe to Gujarat's Jamnagar has tested positive for the Omicron variant of coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X