Zydus Cadila: వ్యాక్సినేషన్‌లో చేరనున్న మరో టీకా: కోటి డోసులకు కేంద్రం ఆర్డర్

న్యూఢిల్లీ: గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్‌కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ సంస్థ జైడస్ క్యాడిలా అభివ‌ృద్ధి చేసిన కరోనా వైరస్ నిర్మూలన వ్యాక్సిన్ జైకోవ్-డీకి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. త్వరలోనే ఈ టీకాను వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేర్చనున్నట్లు తెలిపింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను ఆర్డర్ ఇచ్చింది. ఇది తొలి విడత ఆర్డర్ మాత్రమే. అవి అందిన వెంటనే జైకోవ్-డీని వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేర్చుతుంది. ఈ నెలాఖరులోగా ఈ టీకా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి భారత్‌లో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్‌లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ అత్యధికంగా వినియోగమౌతోంది. స్పుత్నిక్ వీ వాటా పరిమితంగా ఉంటోంది. వాటన్నింటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులను మంజూరు చేసింది. కోవాగ్జిన్‌ కూడా ఇటీవలే డబ్ల్యూహెచ్ఓ అనుమతులను పొందింది. ప్రపంచంలో ఏ దేశానికైనా వాటిని ఎగుమతి చేయడానికి ఈ ఎమర్జెన్సీ లిస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వ్యాక్సిన్లను డబ్ల్యూహెచ్‌ఓ కొనుగోలు చేసి.. పేద దేశాలకు సరఫరా చేస్తుంటుంది.

Zydus Cadilas Covid19 vaccine ZyCoV-D is likely to be included in vaccination drive this month

కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి భారత్ అభివృద్ధి చేసిన రెండో వ్యాక్సిన్.. జైకోవ్-డీ. తొలి వ్యాక్సిన్‌గా కోవాగ్జిన్ ఆ ఘనతను అందుకుంది. జైడస్ క్యాడిలా డెవలప్ చేసిన ఈ వ్యాక్సిన్‌ను రెండు నెలల కిందటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్‌ను వినియోగించడానికి అవసరమైన అనుమతులను జారీ చేసింది. ఇక తాజాగా- దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆది చేరనుంది.

Recommended Video

    Germany: Pilots Return To Work To Cover Tourism Demand

    ఒక్కో డోసు వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం జైడస్ క్యాడిలా ఫార్మాసూటికల్స్ కంపెనీకి 358 రూపాయలను చెల్లిస్తుంది. అదే వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తుంది. ఇప్పటిదాకా ఆరు కోవిడ్ వ్యాక్సిన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ యూజ్ లిస్ట్‌లో చేర్చింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్, ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, సినోఫామ్‌లకు ఆ అనుమతి ఉంది. జైడస్ క్యాడిలా కూడా ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ కోసం త్వరలోనే డబ్ల్యూహెచ్ఓకు అనుమతి దాఖలు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+