ఇన్ఫోసిస్ అద్భుతం.. రూ.3700 కోట్ల డీల్
కొంతకాలంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఒడిదుడుకుల్లో కొనసాగుతోంది. ఒకవైపు కంపెనీల ఆదాయం పడిపోతూ వస్తుండగా, మరోవైపు ఆర్థిక మాంద్యం భయం వెంటాడుతోంది. దీంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించుకుంటూ వస్తున్నాయి. ఐటీ రంగానికి ఇటువంటి నిరాశాజనకమైన పరిస్థితులు ఎదురైన వేళ దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అద్భుతం చేసింది.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 454 మిలియన్ డాలర్ల (3700 కోట్ల రూపాయలు) విలువ చేసే డీల్ కుదుర్చుకుంది. డెన్మార్క్‌కు చెందిన డాన్స్‌కే బ్యాంక్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ఈ డీల్ ఒప్పుకుంది. దీని పీరియడ్ 5 సంవత్సరాలు. అయితే భవిష్యత్తులో ఈ డీల్ విలువ 900 మిలియన్ డాలర్లకు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. 5 సంవత్సరాల తర్వాత మరో 3 సంవత్సరాలు రెన్యువల్ చేసుకునే వెసులుబాటు ఉన్నట్లు ప్రకటించింది.

డాన్స్ కే బ్యాంక్ కోర్ వ్యాపారాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు ఆ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నామని సంస్థ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, జనరేటివ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించబోతున్నామన్నారు. ఇటీవలే యూకేకు చెందిన నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ సేవింగ్స్ ట్రస్ట్ (NEST) నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 1.1 బిలియన్ డాలర్ల డీల్ దక్కించుకుంది. తాజాగా మరో ఐటీ దిగ్గజమైన ఇన్ఫోసిస్ కూడా అదేబాటలో పయనించింది. ఒప్పందంలో భాగంగా బెంగళూరులో ఉన్న డాన్స్ కే బ్యాంక్ ఐటీ కేంద్రం ఇన్ఫోసిస్ నిర్వహణలోకి వస్తుంది.












Click it and Unblock the Notifications