వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో విచిత్ర పరిస్ధితి-రోజుకు లక్ష కోవిడ్ కేసులు-70 శాతం వ్యాక్సిన్లు వేసినా

|
Google Oneindia TeluguNews

కరోనా మొదటివేవ్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డ అమెరికాలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. గతంలో వ్యాక్సిన్లు అందుబాటులో లేని సమయంలో ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన దేశంగా పేరు తెచ్చుకున్న యూఎస్ కు ఇప్పుడు సెకండ్ వేవ్ సమయంలోనూ వ్యాక్సిన్లు ఇస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదు.

అమెరికాలో ప్రస్తుతం రోజువారీ సగటున లక్ష కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ కారణంగా దేశంలో భారీ ఎత్తున కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రభుత్వంలో ఆందోళన పెరుగుతోంది. రెండు నెలల క్రితం రోజుకు కేవలం 11 వేల కేసులు మాత్రమే నమోదు కాగా.. ఇప్పుడు తాజాగా రోజుకు లక్ష దాటి కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ ప్రభావమే దీనికి కారణంగా తెలుస్తోంది.

1 lakh new daily covid 19 cases in US despite 70 percent vaccination

గతేడాది జనవరిలో రోజుకు రెండున్నర లక్షల కేసులు నమోదు కాగా.. నవంబర్ నాటికి ఈ సంఖ్య లక్షకు తగ్గింది. ఇప్పుడు తిరిగి అదే లక్షకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గత రెండు వారాల్లోనే రోజువారీ సగటు 270 నుంచి 500కు చేరడం పరిస్దితి తీవ్రతకు అద్దం పడుతోంది. వ్యాక్సిన్లు వేయించుకోని వారిలో వైరస్ వ్యాప్తి భారీగా ఉంటున్నట్లు అధికారులు చెప్తున్నారు.

Recommended Video

PV Sindhu Visits Kanaka Durga Temple దుర్గమ్మ ఆశీస్సుల తోనే.. | Olympics || Oneindia Telugu

ఇప్పటివరకూ అమెరికాలో 70 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తయింది. మిగతా 30 శాతం జనాభాకు ఇంకా వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. అయితే ఇంత పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు వేసినా డెల్టా వేరియంట్ ప్రభావం చూపుతుండటం కలవరపెడుతోంది. అంటే వ్యాక్సిన్లు వేయించుకున్న వారికీ కరోనా సోకుతున్నట్లు తెలుస్తోంది అదీ డెల్టా వేరియంట్ వ్యాప్తి వేగం కూడా ఎక్కువగా ఉండటంతో జనం ఆస్పత్రుల పాలవుతున్నారు.

English summary
an average of 1 lakh covid 19 new cases has been recording in the US despite 70 percent vaccination completed so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X