పాకిస్తాన్‌లో అంతే.. 11 మందిని నిర్థాక్షణ్యంగా కాల్చి చెంపేశారు!
పొరుగు దేశం పాకిస్తాన్‌లో హింస కొనసాగుతూనే ఉంది. తాజాగా వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో దుండగులు దారుణానికి పాల్పడ్డారు. సాధారణ ప్రయాణికులు వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కుర్రం జిల్లా డిప్యూటీ కమిషనర్ (డీసీ) జావిదుల్లా మెహసూద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని కుర్రం జిల్లా కంజ్ అలిజాయి ప్రాంతంలో ప్రయాణీకుల వాహనంపై సాయుధులైన ముష్కరులు దాడికి తెగబడ్డారు. వాహనంపై తూటాల వర్షం కురిపించారు. దీంతో వాహనంలో ఉన్నవారిలో 11 మంది మరణించగా, ఒక మహిళతో సహా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు డీసీ తెలిపారు.

వరుస దాడులు.. పదుల సంఖ్యలో మరణాలు..
అయితే, ఈ దారుణ హత్యలకు బాధ్యత వహిస్తూ ఏ గ్రూపు కూడా ఇప్పటి వరకు ప్రకటన చేయలేదుని ఆయన స్పష్టం చేశారు. పాక్-ఆఫ్ఘాన్ సరిహద్దుకు సమీపంలోని కుంజ్ అలీజాయ్ పర్వతాల ప్రాంతంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ మీర్ హసన్ వెల్లడించారు. గత కొన్ని నెలలుగా రెండు తెగల మధ్య ఈ ప్రాంతంలో తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి.
గత నెలలో భూ వివాదం కారణంగా చోటు చేసుకున్న హింసలో 46 మంది వరకూ ప్రాణాలు కోల్పోగా, 91 మంది గాయాలపాలయ్యారు. అలాగే, జూలైలో జరిగిన అల్లర్లలో 49 మంది మరణించారు. ఇక్కడి భూ వివాదాలను పరిష్కరించేందుకు కెపి ప్రభుత్వం ల్యాండ్ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే ప్రకటించింది. అయినా ఈ తరహా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications