corona alert: ఇరాన్ నుంచి భారత్‌కు ప్రయాణికులు, 120 మంది నిర్బంధం..
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనా తర్వాత వైరస్ ఎక్కువ ప్రబలింది ఇరాన్, ఇటలీలోనే.. అక్కడ 6 వేల మంది భారతీయులు ఉన్నారు. అక్కడున్న భారతీయులను తరలించేందుకు భారత రాయబార కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు రాగా.. శుక్రవారం మరో 120 మంది భారత్ చేరుకోనున్నారు. ఈ మేరకు రక్షణశాఖ అధికార ప్రతినిధి ఒకరు మీడియా వెల్లడించారు.

120 మంది
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులు బయల్దేరారు. వారిలో 120 మందిని జై సల్మీర్ ఐసోలేషన్ వార్డులో రెండువారాల పాటు నిర్భందిస్తామని అధికారులు పేర్కొన్నారు. వారికి స్క్రీనింగ్ చేసిన తర్వాతనే.. ఐసోలేషన్ వార్డుకు తరలిస్తామని రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నాల్ సోబిట్ ఘోష్ పేర్కొన్నారు. మరో 250 మందిని శనివారం ఇరాన్ నుంచి తరలిస్తామని.. వారిని కూడా జైసల్మీర్‌లో రెండువారాలు నిర్భందించిన తర్వాతనే వారి వారి స్వస్థలాలకు పంపిస్తామని పేర్కొన్నారు.

7 ఐసోలేషన్ సెంటర్లు..
కరోనా వైరస్ సోకిన వారి కోసం రక్షణశాఖ మరో ఏడు నిర్బంధ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని వివరించారు. విదేశాల్లో వైరస్ ప్రబలిన వారిని ఇండియా తీసుకొచ్చి.. ఐసోలేషన్ వార్డులో ఉంచుతామని.. వైరస్ తగ్గాక పంపిస్తామని చెప్పారు. జోద్‌పూర్, ఝాన్సీ, డియోలాలీ, కోల్‌కతా, చెన్నై, సూరత్‌గర్, జైసల్మీర్‌లో ఏర్పాట్లు చేశామన్నారు. ఒకవేళ అవసరమనుకుంటే మిలిటరీ ఆస్పత్రుల్లో కూడా తగిన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

రోజుకు 3.5 లక్షల వ్యయం
హిందాన్, మనేసర్ మిలిటరీ క్యాంపుల్లో 265 మంది పౌరులకు తగిన చికిత్స అందిస్తున్నామని.. రెండు, మూడురోజుల్లో మరికొంతమంది అందులో చేరతామని భారత ఆర్మీ కల్నాల్ ఆమాన్ ఆనంద్ తెలిపారు. మానేసర్ నిర్బంధ కేంద్రంలో రోజుకు రూ.3.5 లక్షలను ఖర్చుచేస్తున్నట్టు మిలిటరీ వర్గాలు తెలిపాయి.
Recommended Video


1100 మంది పర్యాటకులు
ఇరాన్‌లో 6 వేల మంది భారతీయులు ఉన్నారని నిన్న విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ లోక్‌సభలో ప్రకటించారు. అందులో 1100 మంది మహారాష్ర్ట, జమ్ముకశ్మీర్‌కు చెందిన పర్యాటకులు అని వివరించారు. ఇరాన్‌లో చిక్కుకొన్న వారిని స్వదేశం తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications