కరాచీ ఎయిర్‌పోర్టుపై మిలిటెంట్ల దాడి: 28 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్‌లో అత్యంత రద్దీగా ఉండే కరాచీ విమానాశ్రయంపై మిలిటెంట్లు దాడి చేశారు. ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. విమానాలను రద్దు చేసి, సైన్యాన్ని రంగంలోకి దించారు. సోమవారం తెల్లవారు జాముకి ఆపరేషన్ ముగిసింది. ఆపరేషన్ ముగిసిందని, మొత్తం 28 మంది మరణించారని పాకిస్తాన్ అధికార వర్గాలు చెప్పాయి. తెహరీక్ - ఎ - తాలిబన్ పాకిస్తాన్ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు చెప్పారు. మృతుల్లో పది మంది ఉగ్రవాదులు ఉన్నట్లు చెప్పారు.
ఎదురు కాల్పుల్లో ఆరుగురు మిలిటెంట్లు మరణించారు. విమానాశ్రయాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి సైన్యం జరిపిన సుదీర్ఘ పోరులో రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. అన్ని విమానాలను ఖాళీ చేయించినట్లు, ఇద్దరు మిలిటెంట్లు మరణించినట్లు సైన్యానికి చెందిన అధికార ప్రతినిధి ఆసిమ్ సలీం బాజ్వా చెప్పారు.

ఆరుగురు మిలిటెంట్లు మరణించినట్లు, వారు లేత నీలంరంగు యూనిఫారాలు ధరించినట్లు అనధికార వర్గాలు ధ్రువీకరించారు. కాల్పులు జరిపినట్లు ఒకతను పేలిపోయాడని, నడుముకు సూసైడ్ వెస్ట్ ధరించాడని అంటున్నారు.
మిలిటెంట్లు రెండు వైపుల నుంచి విమానాశ్రయంలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు. ఎంత మంది మిలిటెంట్లు లోనికి చొరబడ్డారనే విషయం కచ్చితంగా తేలడం లేదు. మిషన్ గన్లు ధరించి వారు వచ్చినట్లు చెబుతున్నారు.
<center><div id="vnVideoPlayerContent"></div><script>var ven_video_key="NTU0OTUwfHwxMDExfHx8fHx8MTN8fA==";var ven_width="100%";var ven_height="325";</script><script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>












Click it and Unblock the Notifications