కాల్పులు: 13మంది మృతి, ఒకే ఫ్యామిలీలో 8మంది
ఒహియో: అమెరికాలో రెండు వేర్వేరు చోట్ల చోటు చేసుకున్న కాల్పుల ఘటనల్లో 13మంది ప్రాణాలు కోల్పోయారు. ఒహియోలోని కొలంబస్ దక్షిణంలోని పికెటాన్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని తుపాకీతో కాల్చి కిరాతకంగా హత్య చేశారు. వారు పడుకున్న సమయంలో తుపాకీతో కాల్చి చంపారని అధికారులు వెల్లడించారు.
హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒకరే అందరినీ చంపారా, ఎక్కువ మంది కలిసి ఆ దారుణానికి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. మృతుల్లో ఏడుగురు పెద్దవాళ్లు, ఓ టీనేజర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
బాధితులంతా రోహెడెన్ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన వారని... పైక్ కౌంటీ షరీఫ్ చార్లెస్ రీడర్ తెలిపారు. ముగ్గురు చిన్నారులు కాల్పుల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హంతకులు ఎవరనే అంశంపై విచారణ జరుపుతున్నారు. మిగతా కుటుంబసభ్యులను జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

కాగా, అమెరికాలోని జార్జియాలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వరుస కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో శుక్రవారం జరిగిన ఈ రెండు ఘటనల్లో మొత్తం 13 మంది చనిపోయారు.
రెండు ఘటనలకు పాల్పడిన నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో కాల్పుల ఘటనలు అమెరికాలో తరచూ చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగించే అంశమే. కాల్పుల ఘటనలపై అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో..












Click it and Unblock the Notifications