వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డియోడరెంట్ స్ప్రే పీల్చి 14 ఏళ్ళ అమ్మాయి మృతి... ఆమె తండ్రి ఏమంటున్నారంటే

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
జార్జియా

డియోడరెంట్ స్ప్రేను పీల్చడంతో ఓ 14 ఏళ్ల బాలిక మరణించింది. దీంతో బాడీ స్ప్రే వల్ల కలిగే ముప్పు గురించి ప్రోడక్ట్ మీద రాయాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

డెర్బీకి చెందిన 14 ఏళ్ల జార్జియా గ్రీన్ తన బెడ్ రూంలో డియాడరెంట్ స్ప్రే చేసిన తరువాత కార్డియాక్ అరెస్ట్‌కు గురై చనిపోయారు.

తమ కుమార్తెలా డియాడరెంట్‌ను ప్రమాదవశాత్తు పీల్చడం వల్ల మరణించిన మరికొందరు యువత గురించి ఆ తల్లిదండ్రులు తెలుసుకున్నారు.

డియోడరెంట్‌లు పీల్చడం వల్ల చనిపోయే ప్రమాదం ఉందని వాటిపై స్పష్టంగా రాయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అయితే, వాటిపై ఆ విషయం స్పష్టంగా రాసి ఉంటుందని 'బ్రిటిష్ ఏరోసోల్ మేన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్’ చెప్తోంది.

'పిల్లలకు అందకుండా జాగ్రత్తగా ఉంచండి’ అని వాటిపై స్పష్టంగా రాసి ఉంటుంది.

అయితే, ఆ విషయం చాలా చిన్న అక్షరాలలో రాసి ఉందని జార్జియా తల్లిదండ్రులు అంటున్నారు.

ఈ హెచ్చరిక సంగతి తెలియకుండానే చాలామంది తమ పిల్లల కోసం కూడా డియోడరెంట్ కొంటుంటారని జార్జియా తల్లిదండ్రులు చెప్తున్నారు.

వీటి తయారీలో వాడే పదార్థాలు ఎంత ప్రమాదకరమో చాలామందికి తెలియదు అని జార్జియా తండ్రి పాల్ గ్రీన్ చెప్పారు.

జార్జియాకు ఆటిజం సమస్య ఉందని, డియోడరెంట్ వాసన ఆమెకు నచ్చడంతో దాన్ని తన దుప్పట్లపై స్ప్రే చేసుకునేవారని పాల్ చెప్పారు.

'డియోడరెంట్ వాసన ఆమకు హాయినిచ్చేది. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా ఆమె ఆందోళన చెందినట్లుగా అనిపించినప్పుడు ఈ స్ప్రే చల్లేవారు, దానివల్ల కాస్త సౌకర్యంగా ఉండేది’ అని పాల్ చెప్పారు.

2022 మే 11న జార్జియా తన బెడ్‌పై అచేతనంగా పడి ఉండడాన్ని ఆమె అన్నయ్య చూశారు.

'ఆమె గది తలుపు తీసి ఉంది. కాబట్టి తలుపులన్నీ మూసి ఉండడం వల్ల ఊపిరాడక చనిపోయిందని చెప్పలేం’ అన్నారు పాల్.

'ఆమె ఎంత ఎక్కువ స్ప్రే చేశారన్నది చెప్పలేను. కానీ, సాధారణ స్థాయి కంటే ఎక్కువగానే స్ప్రే చేశారు. దానివల్ల శ్వాసద్వారా ఎక్కువగా పీల్చడంతో గుండె ఆగిపోయింది’ అని చెప్పారు పాల్.

జార్జియా మరణంపై విచారణ జరిగింది. ప్రమాదవశాత్తు ఆమె మరణించినట్లు విచారణాధికారి నివేదికలో రాశారు.

జార్జియా మృతికి కచ్చితమైన కారణం ఏంటనేది వైద్యపరంగా తేల్చనప్పటికీ ఏరోసోల్ ఎక్కువగా పీల్చినట్లు వెల్లడించారు.

బాడీ స్ప్రే

కాగా, బ్రిటన్‌లో 2001 నుంచి 2020 మధ్య మొత్తం 11 మంది ఇలా డియోడరెంట్ కారణంగా చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్లలో పేర్కొన్న కారణాల ఆధారంగా 'ఆఫీస్ ఫర్ నేషనల్ స్టేటిస్టిక్స్’ గణాంకాలు చెప్తున్నాయి.

కానీ, వాస్తవ సంఖ్య ఇంతకంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా. అన్ని సందర్భాలలోనూ మరణానికి గల కారణాలను ధ్రువపత్రంలో స్పష్టంగా రాసి ఉండకపోవచ్చు.. కాబట్టి ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు.

జార్జియా డెత్ సర్టిఫికేట్‌లో కూడా ఏరోసోల్ పీల్చడం వల్ల చనిపోయినట్లు పేర్కొన్నారు కానీ డియాడరెంట్ పీల్చడం వల్ల చనిపోయినట్లు రాయలేదు.

జార్జియా మృతికి కారణమైన డియాడరెంట్‌లో వాడింది ప్రధానంగా బ్యూటేన్. దీంతో పాటు ప్రొపేన్, ఐసోబ్యూటేన్ కూడా అందులో ఉన్నాయి.

2001 నుంచి 2022 మధ్య బ్యూటేన్ కారణంగా రికార్డైన మరణాలు 324 కాగా ప్రొపేన్ కారణంగా రికార్డయిన మరణాలు 123, ఐసోబ్యూటేన్ కారణం చనిపోయినట్లు రికార్డైన మరణాలు 38.

ప్రొపేన్, బ్యూటేన్ గ్యాస్ పీల్చడం వల్ల హార్ట్ అటాక్ వస్తుందని ఆఫీస్ ఫర్ ది నేషనల్ స్టాటిస్టిక్స్ రికార్డులలోనూ పేర్కొన్నారు.

డియాడరెంట్ అతిగా స్ప్రే చేయడం వల్ల చాలామంది మరణించినట్లు 'ది రాయల్ సొసైటీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్’ వెల్లడించింది.

'ఇవి ప్రమాదకరం కాదని చాలామంది అనుకుంటుంటారు కానీ వాస్తవం అది కాదు’ అని 'ది రాయల్ సొసైటీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్’కు చెందిన పబ్లిక్ హెల్త్ అడ్వైజర్ ఆష్లే మార్టిన్ చెప్పారు.

జార్జియా

ఏరోసోల్ డియాడరెంట్‌లపై ఎలాంటి హెచ్చరికలు రాసి ఉంటాయి

చట్టప్రకారం ఏరోసోల్ డియాడరెంట్‌లపై 'పిల్లలకు దూరంగా ఉంచాలి’ అనే హెచ్చరిక కచ్చితంగా ముద్రించాలి.

అయితే, దీనికి అదనంగా 'ఈ ద్రావకం దుర్వినియోగం మరణానికి దారితీయొచ్చు’ అని కూడా ముద్రించాలని బ్రిటిష్ ఏరోసోల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సూచిస్తోంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దీన్ని పీల్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాన్ని నివారించడానికి ఇది ముద్రించాలని బ్రిటిష్ ఏరోసోల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సూచిస్తోంది.

ఏరోసోల్ డియాడరెంట్‌లను ఎలా వినియోగించాలనేది కూడా దానిపై రాయాలని, మండే ప్రమాదం ఉంటే అది కూడా దానిపై రాయాలని జార్జియా తండ్రి పాల్ గ్రీన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
14-year-old girl dies after inhaling deodorant spray... What does her father say?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X