ట్రంప్ చర్యపై నిరసన వెల్లువ, ఒక్క కాలిఫోర్నియాలోనే 2 లక్షల మంది, కోర్టుకెక్కిన 15 రాష్ట్రాలు

అమెరికాలో స్థిరపడిన ఎనిమిది లక్షల మంది అక్రమ వలసదారులకు ఒబామా ప్రభుత్వం కల్పించిన రక్షణను ట్రంప్‌ సర్కారు ఎత్తేయడంపై 15 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్‌ కొలంబియా భగ్గుమన్నాయి.

న్యూయార్క్‌: అభం శుభం తెలియని పసి వయస్సులో అమెరికాలో స్థిరపడిన ఎనిమిది లక్షల మంది అక్రమ వలసదారులకు ఒబామా ప్రభుత్వం కల్పించిన రక్షణను ట్రంప్‌ సర్కారు ఎత్తేయడంపై 15 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్‌ కొలంబియా భగ్గుమన్నాయి.

ట్రంప్‌ సర్కారు మీద న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాయి. ట్రంప్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని కొట్టేయాలని న్యాయస్థానాలను ఆశ్రయించాయి. మెక్సికో మూలాలున్న ప్రజలను తుడిచి పెట్టేయాలని ట్రంప్‌ కంకణం కట్టుకున్నారని బ్రూక్లిన్‌ ఫెడరల్‌ కోర్డులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు.

15 states, DC seek court relief over DACA, but will it work?

న్యూయార్క్‌లో 42 వేల మంది డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ ఎరైవల్‌(డాకా) పథకం కింద రక్షణ పొందుతున్నారని, వారంతా ఉత్తమ పౌరులని న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ తన పిటిషన్లో పేర్కొన్నారు.

డాకా రద్దును భారతీయ అమెరికన్‌ సెనెటర్‌ కమలా హ్యారిస్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది అత్యంత క్రూర నిర్ణయమని, ట్రంప్ చర్య వల్ల కాలిఫోర్నియాల్లో రెండు లక్షల మంది జీవితాలు అగమ్య గోచరంగా మారాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+