ఫిలిప్సిన్‌లో చర్చి వద్ద రెండు వరుస పేలుళ్లు, 17 మంది మృతి
జోలో: ఫిలిప్పిన్స్‌లో రెండు వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పదిహేడు మంది నుంచి 21 మంది వరకు మృతి చెందారు. ఈ సంఘటన ఫిలిప్పిన్స్ మిండానో ప్రాంతంలోని జోలో ఐలాండ్ చర్చ్ వద్ద జరిగింది.
వరుసగా రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో యాభై మంది వరకు గాయపడ్డారు. జోలో ఐలాండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులు తెగబడుతున్నారు. కిడ్నాప్‌లు, బాంబు పేలుళ్లు, హత్యలతో ఉగ్రవాదులు దాడులు చేయడం సాధారణంగా మారింది. ఇద్దరు అనుమానితులను స్థానిక పోలీసులు గుర్తించారు.

మొదటి పేలుడు కాథెడ్రల్ చర్చి ప్రాంగణంలో జరిగింది. ఈ పేలుడు జరగగానే సైనికులు వారిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. ఈ సమయంలో రెండో పేలుడు సంభవించింది. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ ఫిలిప్సీన్, ఫిలిప్సీన్ నేషనల్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications