అమెరికాలో తల్లిని చంపిన తెలుగబ్బాయి.. వీడిన మిస్టరీ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమెరికాలో 15 నెలల క్రితం ఓ తెలుగు మహిళ హత్యకు గురైన కేసులో మిస్టరీని స్థానిక పోలీసులు ఛేదించారు. ఆమెను హతమార్చింది.. కడుపున పుట్టిన కొడుకేనని నిర్ధారించారు. కన్నతల్లినే చంపిన ఆ కసాయి కొడుకు.. ఆమె మృతదేహాన్ని గ్యారేజ్ లోని కారులో ఉంచి, ఏం ఎరుగనట్లు స్కూల్ కి వెళ్లిపోయాడు.

సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తిరిగొచ్చి.. తన తల్లిని ఎవరో చంపేశారంటూ పోలీసులకు సమాచారం అందించాడు. ఆ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

17-year-old from Cary charged with murder in mother’s 2015 strangulation

ఈ హత్య 2015 డిసెంబరు 17న జరగ్గా.. ఈ కేసును పలు కోణాల్లో విచారించిన పోలీసులు చివరికి మృతురాలి కొడుకే హంతకుడని నిర్ధారణకు వచ్చారు. ఆమె కొడుకు అర్నవ్ ఉప్పలపాటి(17)ని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. హత్యకు గురైన మహిళ పేరు నళిని తెల్లప్రోలు. వీరు కరోలినాలోని రోలాండ్ గ్లెన్ రోడ్డులో నివసిస్తూ వచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
CARY - A 17-year-old was arrested late Thursday and charged with strangling his mother in their Roland Glen Road home in December 2015. Police took Arnav Uppalapati into custody at a house in the 500 block of North Blount Street in Raleigh about 11:30 p.m., records showed. Uppalapati is charged with murder in the death of Nalini Tellaprolu. Because he is under 18, the charge carries a maximum penalty of life without parole, not the death penalty, police said.
Please Wait while comments are loading...