170 మంది ఐఎస్ఐఎస్ మిలిటెంట్స్ అంతం (వీడియో)
బీరూట్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులను అంతం చెయ్యడానికి సిరియా ఆర్మీ, అమెరికా సంయుక్త దళాలు రంగం సిద్దం చేస్తున్నాయి. వారి ఆగడాలు ఎక్కవ కావడంతో అమెరికా బలగాలు సైతం గత 48 గంటల నుండి వైమానిక దాడులు చేస్తున్నది.
మంగళవారం జరిపిన వైమానిక దాడులలో 170 మంది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అంతం అయ్యారని కుర్దిప్ రక్షణ శాఖ సీనియర్ అధికారి నాజర్ హజ్ మన్సూర్ వెల్లడించారు. గత ఆదివారం నుండి ఐఎస్ఐఎస్ తీవ్రవాదులను అంతం చెయ్యడానికి పలు చోట్ల దాడులు చేస్తున్నారు.

ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు తలదాచుకున్న స్థావరాల మీద వైమానిక దాడులు చేస్తున్నారు. ఈ దాడులలో స్థానికులు కొందరు మరణించగా అనేక మందికి తీవ్రగాయాలైనాయి. మరణించిన 170 మంది జీహాదీలే అని సిరియా మానవహక్కుల సంఘం పరిశీలకులు అంటున్నారు. జీహాది మృతుల సంఖ్య 200కు పైగా పెరిగే అవకాశం ఉందని సిరియా ఆర్మీ వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications