ఉగ్రవాది ఆత్మాహుతి దాడి.. 18 మంది మృతి
నైరుతి పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న సూఫీ టెంపుల్ వద్ద గురువారం ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బలూచిస్తాన్: నైరుతి పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న సూఫీ టెంపుల్ వద్ద గురువారం ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఝల్ మగ్బీ టెంపుల్ ప్రాంగణంలో ఈ ఉగ్రదాడి జరిగింది. ఉన్నట్లుండి పెద్ద పెట్టున పేలుడు సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ ఉగ్రవాది భక్తుడిలా సూఫీ టెంపుల్ పరిసరాల్లో సంచరించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

పోలీసులు అతడిని నిలువరించే ప్రయత్నం చేయడంతో ఆ ఉగ్రవాది తనను తానే పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతిచెందడంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
అయితే దాడికి పాల్పడింది తామేనని ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు. మసీదులను టార్గెట్ చేసే తాలిబన్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications