కొండ మీద నుంచి జారిపడ్డ ట్రక్కు.. 18 మంది మృతి
కాట్మాండు : నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ ట్రక్కు అదుపుతప్పి కొండమీద నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 18 మంది చనిపోయారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కింతాంగ్ నుంచి సిసిఫ్ వైపు వెళుతున్న ట్రక్కు మార్గమధ్యంలో అదుపుతప్పింది. దీంతో కొండపై నుంచి ఒక్కసారిగా నదిలో పడిపోయింది. ఆ సమయంలో 40-50 మంది ప్రయాణీకులు అందులో ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న భద్రతాసిబ్బంది తక్షణమే సహాయకచర్యల్లో మునిగిపోయారు. గాయపడ్డవారిని కాట్మాండు ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. పరిమితిని మించి ప్రయాణీకులు ఎక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications