కన్యత్వాన్ని రూ.17 కోట్లకు అమ్మింది, కాలేజీ ఫీజు కోసమేనా?
డబ్బు అవసరం ఎంత పనైనా చేయిస్తోంది కాలేజీ ఫీజు కోసం తన కన్యత్వాన్ని వేలానికి పెట్టింది ఓ యువతి.తన కన్యత్వాన్ని వేలం పెట్టడం ద్వారా రూ.17 కోట్లు సంపాదించింది.
బుకారెస్ట్: డబ్బు అవసరం ఎంత పనైనా చేయిస్తోంది కాలేజీ ఫీజు కోసం తన కన్యత్వాన్ని వేలానికి పెట్టింది ఓ యువతి.తన కన్యత్వాన్ని వేలం పెట్టడం ద్వారా రూ.17 కోట్లు సంపాదించింది.
రొమేనియోకు చెందిన కెఫ్రెన్ గత ఏడాది తొలిసారిగా తన కన్యత్వాన్ని వేలం వేస్తానని సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ విషయం ప్రకటించిన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
జర్మనీకి చెందిన ఓ ఎస్కార్ట్ సంస్థ ద్వారా ఆమె వేలం పూర్తైంది. ముందుగా ఆమె ఓ మిలియన్ యూరోలతో వేలం ప్రారంభించింది. చివరకు హాంకాంగ్ కు చెందిన ఓ వ్యాపారవేత్త 2.5 మిలియన్ యూరోలకు ఆమె కన్యత్వాన్ని దక్కించుకొన్నాడు.
సిండ్రెల్లా ఎస్కార్ట్ సంస్థ ద్వారా అతడు సంప్రదించాడు. భవిష్యత్తులో ఎవరైనా స్నేహితుడికైనా తన కన్యత్వాన్ని సమర్పించాల్సిందేనని, ఆ తర్వాత అతడు తనతో శాశ్వతంగా ఉండకుండా వదిలి వెళ్ళిపోతాడని అలాంటప్పుడు తన కాలేజీ ఫీజు కోసం ఇలా కన్యత్వాన్ని వేలం వేస్తే తప్పేముందని కెఫ్రెన్ వాదించింది.
తాను ఇలా చేయడం వల్లే చాలామందికి భిన్నాభిప్రాయాలున్నాయని, కానీ, తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకొనే ఈ పనిచేస్తున్నట్టుగా ఆమె చెప్పింది. అయితే కాలేజీ ఫీజు కోసం ఇలా వేలం వేసినట్టు ఆమె చెబుతున్నా, ఆమె తల్లిదండ్రులు బాగానే డబ్బున్నవాళ్లని తెలుస్తోంది.ఈ వేలం విషయంలో ఆమెకు సహకరించినందుకు సిండ్రిల్లా ఎస్కార్ట్ సంస్థకు 20 శాతం మొత్తాన్ని ఆమె కనీషన్ గా చెప్పించింది.












Click it and Unblock the Notifications