స్కాట్లండ్‌లో అసాధారణ పోరాటం-8 గంటల తర్వాత ఇద్దరు భారతీయులకు విముక్తి
బ్రిటన్‌లోని స్కాటిష్ నగరం గ్లాస్గోలో ఓ అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఇమ్మిగ్రేషన్ నేరంపై ఇద్దరు భారతీయుల్ని అదుపులోకి తీసుకున్న స్కాట్లండ్ పోలీసులు చివరికి ప్రజల అసాధారణ నిరసనలతో 8గంటల తర్వాత విడిచి పెట్టాల్సి వచ్చింది. స్ధానిక హక్కుల కార్యకర్త సాయంతో ఇద్దరు భారతీయులకు విముక్తి లభించింది.
భారత్‌కు చెందిన సుమిత్ సహదేవ్ అనే ఛెఫ్, లఖ్వీర్ సింగ్ అనే మెకానిక్ ఇద్దరూ దాదాపు 30 ఏళ్ల వయసువారే. వీరిద్దరు పదేళ్లుగా బ్రిటన్‌లో ఉంటున్నారు. వీరిద్దరూ ఇమ్మిగ్రేషన్ నేరాలకు పాల్పడుతున్న అనుమానంతో బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు, స్కాట్లండ్ పోలీసుల సాయంతో వీరిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. స్కాటిష్ నగరం గ్లాస్‌గోలోని వారి నివాసం నుంచి వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ వ్యాన్‌లో తమ కార్యాలయానికి విచారణకు తరలిచేందుకు ప్రయత్నించారు.

అంతలోనే వీరికి మద్దతుగా భారీగా స్ధానికులు తరలివచ్చి పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. వీరికి పాకిస్తాన్‌కు చెందిన ఆమిర్ అన్వర్ అనే హక్కుల న్యాయవాది కూడా తోడయ్యారు.. గ్లాస్‌గో రోడ్డుపైనే పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి నిరసనలకు దిగారు. వలసదారులతో ఏర్పడిన గ్లాస్‌గో నగరంలో భారత్‌కు చెందిన వారిపై పోలీసుల దౌర్జన్యాన్ని హక్కుల న్యాయవాదితో పాటు నిరసనకారులు తప్పుబట్టారు. ఎనిమిదిగంటలపాటు సాగిన నిరసనల తర్వాత పోలీసులు ఇద్దరు భారతీయుల్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఈ 8 గంటల్లో సోషల్ మీడియా ద్వారా నిరసనల హోరు బ్రిటన్ వ్యాప్తమైంది. దీంతో పోలీసుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి.












Click it and Unblock the Notifications