జపాన్ నౌకలో కరోనా కలకలం: ఇద్దరు భారతీయ సిబ్బందికి పాజిటివ్, వైద్య పరీక్షలు
కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చైనాలోని వుహన్‌లో వెలుగులోకి వచ్చిన రక్కసి.. క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. కేరళలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు జపాన్ తీరంలో డైమండ్ ప్రిపెన్స్ క్రూయిజ్ షిపులో కూడా కరోనా వైరస్ జాడ కనిపించింది. అయితే అందులో పనిచేసే ఇద్దరు భారతీయ సిబ్బంది అని గుర్తించారు.

ఇద్దరికి పాజిటివ్
జపాన్ క్రూయిజ్‌లో గల సిబ్బంది ఇద్దరు ఇండియాకు చెందినవారు అని జపాన్ ప్రభుత్వం భారత్‌కు సమాచారం అందజేసింది. దీనిని భారత విదేశాంగ శాఖ బుధవారం ధృవీకరించింది. క్రూయిజ్ షిప్‌లో మొత్తం 3711 మంది ఉన్నారని.. అందులో 2666 మంది ప్రయాణికులు అని, 1045 మంది సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. 132 మంది సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు భారతీయ పౌరులని ధృవీకరించింది.

174 మందికి పాజిటివ్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నౌకలో ఉన్న వారికి పరీక్షలు చేయగా 174 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో ఇద్దరు భారతీయ సిబ్బంది ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి తగిన చికిత్స అందిస్తామని జపాన్ ఆరోగ్యశాఖ తెలిపింది.

అలర్ట్
నౌకలో ఉన్న భారతీయ సిబ్బందికి వైరస్ సోకిందనే సమాచారంతో భారత అధికారులు అప్రమత్తమయ్యారు. జపాన్ అధికారులతో రాయబార కార్యాలయ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ వారికి అన్నీ పరీక్షలు చేస్తున్నారని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications