ఇద్దరు భారతీయ సిబ్బంది విడుదల.. కనిపించిన గాయాలు, పరీక్షల కోసం ఆస్పత్రికి తరలింపు..
పాకిస్తాన్‌లో కనిపించకుండా పోయిన భారత రాయబార కార్యాలయ ఇద్దరు ఉద్యోగులను ఆ దేశ పోలీసులు వదిలేశారు. కానీ వారిపై గాయాలు కనిపించడంతో దాడి చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం ఉదయం ఇద్దరు ఉద్యోగులు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. విషయం భారత విదేశాంగ శాఖకు తెలియడంతో.. భారత ప్రభుత్వం ఒత్తిడి పాకిస్తాన్ తలొగ్గింది.

రోడ్డు ప్రమాదం అని..
అయితే వారిద్దరూ ఉద్యోగులు పాదచారులను కారుతో ఢీ కొట్టారని, అందుకే పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారని అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో వారి ఆచూకీ గురించి ఆందోళన నెలకొంది. చివరికి ఇస్లామాబాద్ సెక్రటేరియట్ పోలీసు స్టేషన్ వద్ద వారిని అప్పగించి వెళ్లారు. భారత రాయబార కార్యాలయం అక్కడినుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ వారికి వైద్య పరీక్షలు చేసి.. వారి నుంచి స్టేట్‌మెంట్ తీసుకోనున్నారు. ఇద్దరు ఉద్యోగులు ఆచూకీ కనిపించలేదు అని భారత సిబ్బంది చెప్పినా 7 గంటల తర్వాత హిట్ అండ్ రన్ కేసును తెరపైకి తీసుకొచ్చారు.

రంగంలోకి దౌత్య వేత్తలు
భారత హై కమిషన్ సిబ్బంది కనిపించడం లేదు అనే సమచారంతో సోమవారం భారత దౌత్యవేత్తలు, రాయబార కార్యాలయ అధికారులు నిత్యం మానిటర్ చేస్తూనే వచ్చారు. కానీ తర్వాత రోడ్డు ప్రమాద కేసులో సీఐఎస్ఎఫ్, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మీడియాలో వార్తాలొచ్చాయి. అయితే వారు తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ప్రజలు పట్టుకున్నారని అక్కడ మీడియా రిపోర్ట్ చేసింది.
Recommended Video

నో ఎంక్వైరీ, నో హరాస్ మెంట్
హిట్ అండ్ రన్ కేసులో సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారని.. కానీ వారిని విచారించలేదు అని, వేధించలేదని పాకిస్తిన్ డిప్యూటీ హై కమిషనర్ సయ్యద్ హైదర్ షా పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడినుంచి అధికారులను వెళ్లిపోవాలని కోరినట్టు తెలిపారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications