ప్లేన్‌లో మంటలు: ప్రయాణికుల పరుగు, 20మందికి గాయాలు(వీడియో)

చికాగో: ఇంజిన్‌ ఒక్కసారిగా పేలిపోవడంతో అమెరికా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానానికి మంట‌లు అంటుకున్నాయి. ఈ ఘ‌ట‌న అమెరికాలోని చికాగో విమానాశ్ర‌యంలో జ‌రిగింది. టేకాఫ్ తీసుకుంటున్న‌ప్పుడు ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అధికారులు తెలిపారు.

మియామికి వెళ్తున్న‌ బోయింగ్ 767 విమానం టైర్లు, ఇంజిన్ పేల‌డంతో భారీ ఎత్తున్న మంట‌లు చెల‌రేగాయి. జాగ్ర‌త్త‌ప‌డ్డ పైల‌ట్ విమానాన్ని టేకాఫ్ తీసుకోకుండా ప‌క్క‌కు మళ్లించాడు. దీని వ‌ల్ల భారీ ప్ర‌మాద‌మే త‌ప్పింది.

20 injured as plane catches fire in Chicago airport

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కేకలు పెట్టుకుంటూ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటికి పరుగులు తీశారు.

కాగా, ఫ్లైట్ అటెండెంట్‌తో పాటు మొత్తం 20మంది ప్ర‌యాణికులు ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు. ఈ విమానంలో 161 మంది ప్యాసింజెర్లు, మ‌రో 9 మంది సిబ్బంది ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+