ఘోర రోడ్డు ప్రమాదం: 20 మంది మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును ఓవర్ టేక్ చేయబోయి ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది.

ఈ ప్రమాద ఘటన కైరో నుంచి 320 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. అదుపుతప్పి బోల్తా పడిన బస్సు, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే మరణించారు.

20 killed, 3 injured when bus, truck crash in southern Egypt

అస్సియట్ గవర్నర్ ఎస్సామ్ సాద్ ప్రకటన ప్రకారం.. కైరో నుంచి అసియట్‌కు వెళుతున్న బస్సు.. ట్రక్కును ఓవర్ టేక్ చేస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. రెండు వాహనాలు దగ్ధం కావడంతో అక్కడ పరిస్థితి భీతావాహంగా మారింది.

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.

దేశ అధికారిక గణాంకాల ప్రకారం ఈజిప్టులో 2019లో సుమారు 10,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గత సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 3480 మందికిపైగా మరణించారు. 2018లో 8480 కారు ప్రమాదాల్లో 3080 మంది ప్రాణాలు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+