వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌ను దెబ్బకొట్టేది వీళ్లే - తాజా సర్వేలో ఆసక్తికర ఫలితాలు -ఏ వర్గం ఎవరివైపు ఉన్నారంటే

|
Google Oneindia TeluguNews

అమెరికా చరిత్రలోనే అత్యంత ఖర్చుతో కూడిన, ఉత్కంఠభరితంగా సాగుతోన్న 2020 అధ్యక్ష ఎన్నిక చరమాంకానికి చేరింది. మరో 48 గంటల్లో పోలింగ్ ప్రారంభంకానుంది. 'మంగళవారం(నవంబర్ 3) ఓటింగ్ డే' కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పోలింగ్ డే నాడు క్యూలైన్లకు భయపడి ఈ సారి రికార్డు స్థాయిలో దాదాపు 50 శాతం మంది ముందస్తుగానే ఓట్లే వేసి ఉండటం గమనార్హం.

పోలింగ్ కు రెండ్రోజుల ముందు.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ల భవితవ్యాన్ని అంచనా వేస్తూ కీలకమైన సర్వేలు వెలువడ్డాయి. తద్వారా అమెరికాలో ఏ వర్గం ఓటర్లు ఎవరివైపు ఉన్నారనేది దాదాపు స్పష్టంగా తేలిపోయింది..

కోఆపరేటివ్ ఎలక్షన్ స్టడీ

కోఆపరేటివ్ ఎలక్షన్ స్టడీ

అమెరికా ఎన్నికలకు సంబంధించి ‘కోఆపరేటివ్ ఎలక్షన్ స్టడీ'ని ప్రముఖంగా ప్రస్తావిస్తారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన రాజనీతిశాస్త్ర పరిశోధకులు 2006 నుంచి ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. 2020 కోఆపరేటివ్ ఎలక్షన్ స్టడీ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ చివరి దాకా వివిధ వర్గాలకు చెందిన మొత్తం 71 వేల మందిని ఆన్ లైన్ లో సర్వే చేశామని నిర్వాహకులు చెప్పారు. వాటి ఫలితాలు ఇలా ఉన్నాయి..

యువతకు బైడెన్.. వృద్ధులకు ట్రంప్..

యువతకు బైడెన్.. వృద్ధులకు ట్రంప్..

2020 కోఆపరేటివ్ ఎలక్షన్ స్టడీ ఫలితాల్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ప్రస్తుత ఎన్నికల్లో 18 నుంచి 44 ఏళ్లలోపు యువకులంతా డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ కు మద్దతు పలుకుతుండగా, 65 ఏళ్లు పైబడిన వారిలో 53 శాతం మంది ట్రంప్ ను సమర్థిస్తున్నారు. అదే సమయంలో నిరుద్యోగుల్లోనూ బైడెన్ కు భారీగా మద్దతు ఉన్నట్లు సర్వే తేలిపింది. 2016లో హిల్లరీ క్లింటన్ కు ఓటేసినవారిలో 95 శాతం మంది ఇప్పుడు బైడెన్ కు మద్దతుగా ఉన్నారని, 2016లో ట్రంప్ కు ఓటేసినవాళ్లలో 90 శాతం మంది తిరిగి సపోర్ట్ చేస్తున్నారని సర్వేలో తేలింది.

జో వైపే ఆసియన్ అమెరికన్లు

జో వైపే ఆసియన్ అమెరికన్లు

2020 అధ్యక్ష ఎన్నికల్లో ఆసియన్ అమెరికన్లు ఏకపక్షంగా జోబైడెన్ ను సమర్థిస్తున్నారని, ఈ వర్గానికి చెందిన 65 శాతం ఓటర్లు డెమోక్రాట్ అభ్యర్థిని సమర్థిస్తుండగా, కేవలం 28 శాతం మంది మాత్రమే ట్రంప్ కు మద్దతుగా ఉన్నారని కోఆపరేటివ్ ఎలక్షన్ స్టడీలో వెల్లడైంది. అదేసమయంలో ట్రంప్ పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తోన్న నల్లజాతీయులు 86 శాతం మంది బైడెన్ వైపు నలిచారు. హిస్పానిక్ అమెరికన్లలో 59 శాతం మంది బైడెన్ కు మద్దతు పలుకుతున్నారు. ఈ వర్గం నుంచి ట్రంప్ సమర్థకుల శాతం 35 మాత్రమే.

వైట్ ఓట్ల వేటలో ట్రంప్ పైచేయి..

వైట్ ఓట్ల వేటలో ట్రంప్ పైచేయి..

అవకాశం దొరికిన ప్రతిసారి వర్ణ అహంకారాన్ని ప్రదర్శించే డొనాల్డ్ ట్రంప్ కు అమెరికాలోని శ్వేతజాతీయుల్లో ఫాలోయింగ్ తగ్గలేదు. 2020 ఎన్నికల్లోనూ శ్వేతజాతీయుల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఈ వర్గానికి చెందిన 49 శాతం మంది రిపబ్లికన్లకు, 45 శాతం మంది డెమోక్రాట్లవైపు మొగ్గుచూపుతున్నారు. కాలేజీ డిగ్రీ లేని శ్వేతజాతీయుల్లో 57 శాతం మంది ట్రంప్ వైపు, 38 శాతం మంది బైడెన్ వైపు నిలబడ్డారు. అదే డిగ్రీ ఉన్నవాళ్లలో 58 శాతం బైడెన్ కు, 36 శాతం మంది ట్రంప్ కు మద్దతిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.

ట్రంప్ కొంపముంచే వర్గమిది..

ట్రంప్ కొంపముంచే వర్గమిది..

ప్రస్తుత అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ను ఏకపక్షంగా వ్యతిరేకిస్తోన్న వర్గం ఏదైనా ఉందంటే.. అది మహిళా లోకమే. అమెరికాలోని మహిళా ఓటర్లలో ట్రంప్ కు 39 శాతం మంది మాత్రమే మద్దతు ఇస్తుండగా, 55 శాతం మహిళలు బైడెన్ ను సమర్థిస్తున్నారు. పురుష ఓటర్లలో ఇద్దరు అభ్యర్థులకూ దాదాపు సమాన మద్దతు లభించింది. ‘కోఆపరేటివ్ ఎలక్షన్ స్టడీ'తోపాటు తాజాగా విడుదలైన సర్వే ఫలితాల్లోనూ ట్రంప్ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపించాయి.

జో బైడెన్.. జాతీయ స్థాయిలో 8 పాయింట్ల తేడాతో ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారని సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. ట్రంప్ జేబు సంస్థగా పేరుపొందిన ‘ది ఫాక్స్ న్యూస్' విడుదల చేసిన సర్వేలో 52శాతం మంది ఓటర్లు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతు తెలిపారు. 44 శాతం మంది నవంబర్ 3న ట్రంప్‌కు ఓటేయనున్నట్లు చెప్పారు. సీఎన్ఎన్ సర్వే ఫలితాల్లో కూడా ట్రంప్ వెనడబడ్డట్టు వెల్లడైంది. రిజిస్టర్ చేసుకున్న ఓటర్లలో 54 శాతం మంది జో బైడెన్‌కు మద్దతు తెలుపగా.. 42శాతం మంది ఎన్నికల్లో ట్రంప్‌కు ఓటేయనున్నట్లు చెప్పారు.

English summary
Americans of Asian, African and Hispanic descent are projected to overwhelmingly vote for Democratic Presidential nominee Joe Biden while Whites are favouring President Trump by a thin margin, according to a preliminary data of voters. The 2020 Cooperative Election Study of over 71,000 online respondents from late September through October end found that 51 per cent of all likely voters favour Biden while 43 per cent support Trump. Biden was the preferred choice among voters aged 18-29 and 30-44 while 53 per cent of voters aged 65 years and more favoured Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X