ట్రక్ ను డీకొట్టిన బస్సు: 21 మంది దుర్మరణం
కాంబోడియా: వేగంగా వెలుతున్న బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్ ను డీకొట్టడంతో 21 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ప్రమాదంలో అనేక మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
కంబోడియాలోని కాంపాంగ్ రో జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. స్థానిక కంబోడియా ఎక్స్ ప్రెస్ మీడియా కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంగళవారం ఉదయం పోనంపెహ్ నుండి ప్యాసింజర్ బస్సు బయలు దేరింది.

మార్గం మద్యలో కంబోడియా స్వే రింగ్ ప్రావెన్స్ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న పెద్ద ట్రక్ ను బస్సు డీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో కొందరు మరణించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్షంగా వాహనం నడపడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసులు అన్నారు. బస్సు డ్రైవర్ ను అరెస్టు చేశారు. మరణించిన వారు ఒక గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారని స్థానిక పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications