భారత్‌కు భారీ షాకిచ్చిన అమెరికా: మోదీ వచ్చీ రాగానే.. : ఒక్క పోటుతో అవుట్
Donald Trump: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇటీవలే అమెరికాలో పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. భారత అక్రమ వలసదారులు, రెండు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, వాణిజ్యపరమైన సంబంధాలపై చర్చించారు. డిఫెన్స్, ఆర్టిఫీషియల్ టెక్నాలజీ రంగాల్లో పరస్పర పెట్టుబడులు పెట్టడానికీ అంగీకారం తెలియజేశారు.
ఈ పర్యటన ముగించుకుని మోదీ స్వదేశానికి చేరుకున్న రెండో రోజే భారీ షాక్ ఇచ్చింది అమెరికా. ఓ భారీ ప్రాజెక్టును రద్దు చేసిపడేసింది. దీని విలువ 22 మిలియన్ డాలర్లు. ఫలితంగా- ఈ ప్రాజెక్ట్ కింద భారత్‌కు మంజూరు కావాల్సిన 22 మిలియన్ డాలర్ల మేర చెల్లింపులు ఒక్క సంతకంతో రద్దయ్యాయి.

ఈ రద్దు చేసింది కూడా మరెవరో కాదు- యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) అధినేత ఎలాన్ మస్క్. ఓటర్ టర్నవుట్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఉద్దేశించిన నిధులు ఇవి. దీన్ని రద్దు చేసినట్లు డోజ్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఈ విషయాన్ని ఎక్స్ హ్యండిల్‌లో పోస్ట్ చేసింది. దీన్ని ఈ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఎలాన్ మస్క్ రీట్వీట్ చేశారు.
భారత్‌తో పాటు వివిధ ప్రాజెక్టుల కింద మరికొన్ని దేశాలకు అందజేస్తోన్న ఆర్థికపరమైన కేటాయింపులన్నింటినీ రద్దు చేసింది. అమెరికన్లు కడుతున్న పన్నులు.. ఈ రకంగా దుర్వినియోగమౌతోన్నాయని పేర్కొంది. ఈ పన్నుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేసింది.
మొజాంబిక్ 10 మిలియన్ డాలర్లు, కంబోడియాలో రెండు ప్రాజెక్టుల కింద 12 మిలియన్ డాలర్లు, ప్రేగ్ సివిల్ సొసైటీ సెంటర్- 32, సెర్బియా- 486, మొల్డొవా- 22, భారత్- 21, బంగ్లాదేశ్- 19, లైబీరియా- 1.5, నేపాల్- 19, మాలీ- 14 మిలియన్ డాలర్ల మేర నిధుల కేటాయింపులను రద్దు చేసినట్లు డోజ్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications