ఇరాక్: పెప్సీ ఫ్యాక్టరీలో చిక్కుకున్న ఎపి, టి వాసులు
న్యూఢిల్లీ: ఇరాక్‌లో అంతర్యుద్ధం నేపథ్యంలో... పెప్సీ కంపెనీలో 250 మంది తెలుగు కార్మికులు చిక్కుకుపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగు వారు పెప్సీ కంపెనీలో చిక్కుకుపోయారు. ఈ కంపెనీకి బయట తీవ్ర బాంబుల మోత, కాల్పులు కొనసాగుతున్నాయి.
ఈ సమయంలో కంపెనీ యాజమాన్యం కార్మికులను వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. బయట పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో ఏం చేయాలో తెలియక తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వారి పాస్‌పోర్టులు కూడా హ్యూమన్ సోర్సెస్ మోనేజర్ వద్ద ఉన్నాయని చెబుతున్నారు.

పెప్సీ కంపెనీ మూడు రోజులుగా మూతబడింది. అందులోనే వారు ఉన్నారు. మూడు రోజులుగా వారికి తిండి, తిప్పలు లేదు. పెప్సీ కంపెనీలో చిక్కుకున్న వారిలో తెలంగాణలోని అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉభయ గోదావరి జిల్లా వారు ఉన్నారు.
కాగా, ఇరాక్‌లో తెలంగాణ వారు 1038 మంది చిక్కుపోయినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. గత ఏడాది కాలంలో ముంబై విమానాశ్రయం నుండి 858 మంది, జైపూర్ విమాశ్రయం నుండి 180 మంది వెళ్లినట్లు సమాచారం సేకరించింది.












Click it and Unblock the Notifications