Gold Mine: బంగారు గనిలో అగ్నిప్రమాదం.. 27 మంది మృతి..
దక్షిణ పెరూలోని మారుమూల ప్రాంతంలోని బంగారు గనిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది కార్మికులు మరణించారని అధికారులు తెలిపారు. ఇది దక్షిణ అమెరికా దేశంలో ఇటీవలి చరిత్రలో అత్యంత ఘోరమైన మైనింగ్ విషాదాలలో ఒకటిగా నిలిచింది. అరిక్విపా నగరానికి సమీపంలోని లా ఎస్పెరాంజా 1 గనిలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించడంతో మంటలు వ్యాపించాయని అధికారులు భావిస్తున్నారు.
ఘటన సమయంలో గని కార్మికులందరూ 100 మీటర్ల లోతులో పనులు చేస్తున్నారని పేర్కొంది. వారిలో 27 మంది దుర్మరణం పాలయ్యారని, 175 మందిని సురక్షితంగా తరలించామని మైనింగ్ సంస్థ తెలిపింది. "షార్ట్ సర్క్యూట్ జరిగిందని, దాని వల్ల పేలుడు సంభవించిందని మాకు తెలుసు. జరిగిన ప్రతిదానికీ మేము చాలా దిగ్భ్రాంతికి గురయ్యాము" అని ఫ్రాన్సిస్కో ఇడ్మే మమని చెప్పారు. ఈ ప్రమాదంలో ఆయన సోదరుడు 51 ఏళ్ల ఫ్రెడెరికో కూడా మరణించాడు.

ప్రాంతీయ రాజధాని అరేక్విపా నగరం నుండి 10 గంటల ప్రయాణంలో రిమోట్ కాండెసుయోస్ ప్రావిన్స్‌లోని గనిలో పేలుడు సంభవించిన తర్వాత మంటలు ప్రారంభమైనట్లు స్థానిక మీడియా ముందుగా తెలిపింది. పోలీసులు మరణించిన వారి వివరాలను సేకరించిస్తున్నారు. మృతదేహాలను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. "చనిపోయినవారు ఉన్న స్థలాన్ని మేము సురక్షితంగా ఉంచాలి, తద్వారా మేము అందులోకి ప్రవేశించి మృతదేహాలను తిరిగి పొందగలము" అని మాటోస్ చెప్పారు.
ప్రమాదస్తలిలో బాధితుల రోధనలు మిన్నాంటాయి. "ఎక్కడున్నావు డార్లింగ్, ఎక్కడున్నావ్?" అని మార్సెలీనా అగ్యిర్రే క్విస్పే ఓ మహిళ తన భర్త కోసం కన్నీరు పెట్టుకోవడం అక్కడున్న వారిని కదిలించింది. లాటిన్ అమెరికాలో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు పెరూలో ఇటీవలి సంవత్సరాలలో జరిగిన ఘోరమైన మైనింగ్ ప్రమాదాలలో ఈ సంఘటన ఒకటి. కంపెనీ 23 ఏళ్లుగా పెరూలో గనులను నిర్వహిస్తోంది. 2020లో, అరేక్విపాలో గని కూలిపోవడంతో నలుగురు కార్మికులు చిక్కుకుని మరణించారు.












Click it and Unblock the Notifications