నైట్‌క్లబ్‌లో పేలుడు, అగ్ని ప్రమాదం: 27మంది మృతి
బుకారెస్ట్: రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో పేలుళ్లతో కూడిన భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 27 మంది మరణించగా, 180 మందికి పైగా గాయపడ్డారు. టపాసులతో కూడిన రాక్ సంగీత కచేరీ నిర్వహించిన సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు తెలి పారు.
మంటలు చెలరేగడంతో పాటు బాగా పొగ అలముకోవడంతో క్లబ్‌లో ఉన్న 400 మంది ఒకేసారి బయటకు వచ్చేందుకు ప్రయత్నించి విపరీతమైన తొక్కిసలాట కూడా జరిగింది. క్లబ్ లోపల టపాసులు కాల్చేందుకు ప్రయత్నించడం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

మంటల్లో క్లబ్ సీలింగ్‌తో పాటు ఒక పిల్లర్ కూడా కాలిపోయింది. తర్వాత భారీ పేలుడు సంభవించి లోపలంతా పొగ అలముకుందని తెలిపారు. బయట ఫుట్‌పాత్ మీద పడి ఉన్న అనేకమందికి కృత్రిమంగా ప్రాణవాయువు అందించేందుకు పారామెడికల్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా ప్రయత్నించారు.
ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బుకారెస్ట్‌లో ఉన్న పది ఆస్పత్రులలో బాధితులను చేర్చినట్లు హోంశాఖ డిప్యూటీ మంత్రి రయీద్ అరాఫత్ చెప్పారు.
ఐదు సెకండ్లలోనే మొత్తం సీలింగ్‌కు మంటలు అంటుకున్నాయని, ఒకే డోర్ ఉండటంతో దానిగుండానే అందరం బయటపడాల్సి వచ్చిందని ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఓ యువతి చెప్పింది.












Click it and Unblock the Notifications