బంగ్లాదేశ్‌లో మరో ఘోరం: 27 ఏళ్ల బ్లాగర్ హత్య, ఇద్దరి అరెస్ట్
ఢాకా: బంగ్లాదేశ్‌లో మరో బ్లాగర్‌ను దారుణంగా హత్య చేశారు. 27 ఏళ్ల బ్లాక్ రచయితను ఇస్లాంవాదులుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపేశారు. వీరిలో ఇద్దరు నిందితులను పోలీసులు సంఘటన స్థలంలోనే అరెస్టు చేశారు.
ఈ సంఘటన ఢాకాలోని బేగుంబరి ప్రాంతంలో సోమవారం జరిగింది. హత్యకు గురైన బ్లాగర్ వశీకుర్ రెహ్మాన్ మిషు. ముగ్గురు వ్యక్తులు వచ్చి అతనిని మాంసం కొట్టే కత్తులతో దాడి చేశారు. ముఖాన్ని ఛిద్రం చేశారు. నిందితులు హతజరి మదర్సా విద్యార్థులుగా తెలుస్తోంది.

జికుల్ అరిఫుల్‌లను పోలీసులు కత్తులతో సహా అరెస్టు చేశారు. మరో నిందితుడు తెహ్రాన్ పరారీలో ఉన్నాడు. మిషు తన బ్లాగులో రాసిన వ్యాఖ్యల విషయంలో సైద్ధాంతిక విభేదాల కారణంగానే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు.
సదరు బ్లాగర్ తన ఇంటికి 500 యార్డ్స్ దూరంలో హత్య గావించబడ్డాడని పోలీసులు తెలిపారు. రెహ్మాన్ మిషు కుత్సిత్ హాషర్ చన్నా అనే కలం పేరుతో బ్లాగ్‌లో రాస్తున్నట్లుగా చెబుతున్నారు. అతను ప్రగతిశీల ఆలోచనపరుడు అని చెబుతున్నారు. కాగా, 2013లో సైతం బంగ్లాదేశ్‌లో ఓ బ్లాగర్ హత్యకు గురయ్యారు.












Click it and Unblock the Notifications