30 ఏళ్ల క్రితం కూతురిని రూమ్ లో పెట్టి తాళం వేశారు.. ఇప్పుడు తెరిచి చూస్తే..
పోలాండ్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఈ భయంకరమైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 30 ఏళ్ల క్రితం కూతురిని చిన్న రూమ్ లో పెట్టి తాళం వేశారు తల్లిదండ్రులు. స్థానికులు, కుటుంబ సభ్యులు బాలిక మిస్సింగ్ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు రూమ్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. ఇన్నేళ్లు ఆమె ఇంట్లోనే ఉందని తెలిసి వాళ్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి. 1998 లో ఓ దంపతులు తమ 15 ఏళ్ల కుమార్తెను ఇంట్లోని ఓ చిన్న రూమ్ లో పెట్టి తాళం వేశారు. అయితే ఇలా ఎందుకు చేశారు అన్న దానిపై క్లారిటీ లేదు.
సౌత్ పోలాండ్ లోని స్వీట్ చోవిస్ ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మిరెల్లా అనే మహిళ తన 42 ఏళ్ల వయసులో చిన్న రూమ్ నుంచి విడుదలై బయటకు వచ్చింది. 1998లో తనకు 15 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు ఇంట్లోని చిన్న రూమ్ లో పెట్టి తాళం వేశారు. అప్పటి నుంచి ఆమె రూమ్ లోనే ఉంటోంది. కూతురిని బంధించిన పేరెంట్స్ పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. స్థానికులకు కూడా తమ కుమార్తె మిస్ అయిందని.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నమ్మించారు. వాళ్లంతా నిజమే అనుకున్నారు.
అయితే ఇటీవల జులైలో ఆ ఇంట్లో నుంచి కదలికలు రావడం స్థానికులు గుర్తించారు. మిరెల్లా అదే రూమ్ లో ఏళ్ల తరబడి ఉండటం కారణంగా ప్రాణాంతక ఇన్ ఫెక్షన్ సోకింది. దీంతో ఆమె బయటకు వచ్చేందుకు యత్నించింది. కదలికలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇంట్లో మిరెల్లా ఉన్నట్లు గుర్తించారు. ఆమెను పలకరించగా తాను బానే ఉన్నట్లు సమాధానం ఇచ్చింది. అయితే ఆమె కాళ్లకు ఇన్ ఫెక్షన్ సోకడం గమనించిన పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. మరికొన్ని రోజులు మాత్రమే మిరెల్లా ప్రాణాలతో ఉంటుందని తెలిపారు.

మిరెల్లా ఆస్పత్రి ఖర్చుల కోసం స్థానికులు ఫండ్స్ ను సేకరించారు. ఆ నిధులతో వైద్యం అందిస్తున్నారు. మిరెల్లా గురించి తెలిసినవాళ్లు.. ఆమె 30 ఏళ్ల క్రితమే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అనుకున్నామని కానీ ఇలా ఇంట్లోనే ఉందని ఊహించలేదని తెలిపారు. అయితే మిరెల్లాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు ఎందుకు రూమ్ లో బంధించారు..? ఆమె మిస్సింగ్ అని ఎందుకు అబద్ధం చెప్పారు..? అన్న ప్రశ్నలు మిస్టరీగా మారాయి. వీటిపై త్వరలోనే పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications