మరియుపోల్‌లో విధ్వంసం : థియేటర్‌పై రష్యా దాడులు.. 300 మంది మృతి..!!

ఉక్రెయిన్‌పై రష్యా సేనలు నిరవధికంగా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకుని క్షిపణులతో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ప్రపంచ దేశాల ఆంక్షలను, అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ లెక్కచేయడం లేదు. తమ టార్గెట్ పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్, ఐరోపా దేశాలు ఆంక్షలు పెంచే కొద్ది రష్యా కూడా ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేసింది. కింజల్ హైపర్ సోనిక్ క్షిపణులను, కాలిబర్ దీర్ఘశ్రేణి క్రూజ్ మిస్సైల్స్‌ను మాస్కో ప్రయోగిస్తోంది.

 థియేట‌ర్‌పై దాడి.. 300 మంది మృతి

థియేట‌ర్‌పై దాడి.. 300 మంది మృతి

మరియుపోల్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. రష్యా దాడులతో నగరం మొత్తం దాదాపు ధ్వంసమైంది. దీన్ని మరలా పునర్నిర్మించాలంటే.. కొన్నేళ్లు పడుతుంది. నగరంలో సగం భాగాన్ని రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. మరియుపోల్ ఓ థియేటర్‌పై గతవారం రష్యా బలగాలు దాడులు జరిపాయి. ఈ దాడుల్లో దాదాపు 300 మంది పౌరులు చనిపోయినట్లు తెలుస్తోంది. వారిలో చిన్నారులు కూడా ఉన్న‌ట్లు స‌మాచారం వందలాది మంది ఆశ్రయం పొందుతున్న థీయేటర్‌పై రష్యా విచక్షణా రహితంగా దాడులు జరిపిందని ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో 300 మంది మృతిచెంది ఉంటారని ఉక్రెయిన్ అధికారులు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

అత్యంత క్లిష్టంగా ప‌రిస్థితులు


రష్యా దాడులతో మరియుపోల్ నగరం నాశమైందని మేయర్ వాదియ్ బోయ్ చెంకో తెలిపారు. నగరంలో చిక్కుకుపోయిన పౌరులకు అందించే సాయాన్ని కూడా రష్యాసేనలు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవతా పరిస్థితులు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నిజంగా మానవతా సంక్షోభమేనని.. పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని పేర్కొన్నారు. మరియుపోల్ నగరంలో దాదాపు లక్షమంది పౌరులు చిక్కుకుని ఉన్నారని తెలిపారు. వారి ప్రాణాలను కాపాడాలంటే తరలింపు ప్రక్రియ ఒక్కటే మార్గమన్నారు. అందుకు తగ్గ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఆక‌లితో అల‌మ‌టిస్తున్న పౌరులు

ఆక‌లితో అల‌మ‌టిస్తున్న పౌరులు


మరోవైపు మరియుపోల్‌లో పౌరులకు ఆహారం, తాగునీరు దొరకడం లేదు. ఆకలితో అలమటిస్తున్నారు. చిన్నారులు, మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. రష్యా బాంబుల దాడులతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కొందరు నగరరాన్ని వదిలి పారిపోయారు. అటు రష్యా భీకర బాంబుల దాడులతో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని ఉక్రెయిన్‌లోని ఐరాస మానవహక్కుల బృందం అధిపతి మటిల్డా బోగ్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే ప్రదేశంలో 200 మృతదేహాలను సమాధి చేసినట్లు తెలుస్తోందన్నారు. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను సేకరించినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌లో ప‌రిస్థితులు రోజురోజుకు గ‌డ్డుప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+