32 ఏళ్ల వయస్సు మహిళ పడుకొని, 15 ఏళ్ల బాలికగా లేచింది!!
లండన్: ఓ పెళ్లైన 32 ఏళ్ల మహిళ నిద్రించి, ఆ తర్వాత లేచింది. అయితే తాను పదిహేనేళ్ల అమ్మాయిని అనే భావిస్తూ ఆమె నిద్రలేచింది. నవోమీ జాకోబ్స్ అనే 32 ఏళ్ల మహిళ తన పాత స్మృతులను గుర్తు చేసుకుంది. 2008లో ఆమె నిద్రపోయి, 15 ఏళ్ల బాలికగా లేచింది!
నవోమీ జాకోబ్స్ తాను ఇంకా 1992లోనే ఉన్నానని భావించింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ఆ రోజు తాను చాలా ఆందోళనకు లోనయ్యానని చెప్పారు. తాను నిద్ర లేచాక బాత్ రూంలోని అద్దంలో చూసుకున్నానని, ఒక్కసారిగా షాకయ్యానని చెప్పారు.
తన పెదాలు వణికాయని, తాను అరుస్తూ పరుగెత్తానని చెప్పారు. ఓహ్ మై గాడ్ అంటూ భయపడ్డానని గుర్తు చేసుకున్నారు. తాను అరుస్తూ, ఆందోళనతో ఇళ్లంతా తిరిగానని చెప్పారు. నాడు, 32 ఏళ్ల జాకోబ్స్ 2008లో తన కొడుకును పాఠశాలకు తీసుకు వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి పడుకుంది. లేచాక 15 ఏళ్ల వయస్సు దానిలా భావించింది.

మరో షాకింగ్ విషయమేమంటే.. 2008లో ఆమె అప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీని ఏమీ గుర్తు పట్టలేకపోయింది. 1992కు సంబంధించిన అంశాలే గుర్తున్నాయి. తనకు అప్పటికి ఓ కొడుకు ఉన్నాడనే విషయం గుర్తుకు లేదు. టీనేజ్ గర్ల్‌గానే భావించుకుంది.
ప్రస్తుతం ఆమె వయస్సు 39 ఏళ్లు. ఆమె కొడుకు వయస్సు 10. కాగా, ఇది ఓ మానసిక రోగమని, దీనిని డిసోసియేటివ్ అమ్నేషియా అంటారని చెబుతున్నారు. ఇది లక్షల్లో ఒకరికి వస్తుందని చెబుతున్నారు.
1992లో ఆమె జీసీఎస్ఈ చదువుతోంది. ఆ సమయంలో ప్రధానిగా జాన్ మేజర్ ఉన్నారు. దీంతో, 1992 స్మృతిలో ఉన్న ఆమె ప్రధానిగా ఆయన పేరే అనుకున్నారు. ఆ సమయంలో అసలు తాను ఎక్కడున్నానో కూడా తెలియని పరిస్థితి అని చెప్పారు.












Click it and Unblock the Notifications