రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం: 37మంది మృతి..
సైబీరియా: రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇండస్ట్రియల్ నగరమైన పశ్చిమ సైబీరియాలోని ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అగ్ని ప్రమాదంలో దాదాపు 37మంది వరకు ప్రాణాలు కోల్పోయారని రష్యన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ ప్రకటించింది.
మంటలను అదుపులోకి తెచ్చేందుకు వందలాది సిబ్బందిని అక్కడికి తరలించారు అధికారులు. ఆ కాంప్లెక్స్ లో సినీ మల్టీప్లెక్స్ కూడా ఉండటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాంప్లెక్స్ లో చిక్కుకుపోయినవాళ్లలో దాదాపు 69మంది ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదని, అందులో 40మంది చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక రెస్క్యూ సర్వీస్ సిబ్బంది చెప్పారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందన్నారు.
అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో.. మల్టీప్లెక్స్ లోని రెండు థియేటర్లలో పైకప్పు కూలిపోయిందని ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది. సైబీరియాలోని ప్రధాన షాపింగ్ సెంటర్ కావడం.. అది కూడా ఆదివారం కావడంతో.. ఎక్కువమంది ఆరోజు మాల్‌కు వచ్చినట్టు చెబుతున్నారు. అయితే ప్రమాద సమయంలో ఎంతమంది ఆ మాల్ లో ఉన్నారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications