నలుగురి భారతీయుల్ని కిడ్నాప్ చేసిన ఐసిస్, ఇద్దరు ఏపీ, తెలంగాణవాసులు
హైదరాబాద్: లిబియాలో నలుగురు భారతీయులను ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కిడ్నాప్‌కు గురైన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి ఉన్నట్లుగా తెలుస్తోంది.
లిబియాలో పలువురు భారతీయులు పని చేస్తున్నారు. కిడ్నాప్‌కు గురైనట్లుగా భావిస్తున్న ఈ నలుగురు భారతీయులు ట్రిపోలీ సమీపంలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఇందులో తెలంగాణ, ఏపీలకు చెందిన గోపీకృష్ణ, బలరాం కాగా, ఇద్దరు కర్నాటకకు చెందినవారిగా తెలుస్తోంది.

బాధిత కుటుంబాలతో ఎంబసీ అధికారులు మాట్లాడుతున్నారని తెలుస్తోంది. నలుగురిని కిడ్నాప్ చేసిన ఐసిస్ తీవ్రవాదులు ఇప్పటి వరకు ఎలాంటి డిమాండ్లు చేయలేదని ఎంబసీ అధికారులు చెబుతున్నారని తెలుస్తోంది. వీరిని బుధవారం కిడ్నాప్ చేసినట్లుగా సమాచారం.
కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్ రాలేదు
నలుగురు భారతీయులకు చెందిన కిడ్నాప్ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నలుగురు భారతీయులు కిడ్నాప్ అయ్యారని, అందులో ఇద్దరు తెలుగువారు, ఇద్దరు కర్నాటకవాసులు ఉన్నట్లు చెప్పింది. కిడ్నాప్‌కు సంబంధించి కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్ రాలేదని పేర్కొంది. కిడ్నాప్‌కు గురైన వారిని తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
కేంద్రం నాడే సూచనలు
లిబియాలో నివసిస్తున్న వారికి గత ఏడాది కేంద్రం సూచనలు చేసింది. ఐసిసి ఉగ్రవాదం నేపథ్యంలో తిరిగి భారతీయులు తిరిగి రావాలని సూచించింది. కొందరు తిరిగి వచ్చినప్పటికీ, ఇంకా పలువురు అక్కడే ఉండిపోయారు. లిబియాలో తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్ 17,000 మంది భారతీయులను వెనక్కి తీసుకు వచ్చింది.












Click it and Unblock the Notifications