కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద పేలుడు: 4గురు మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద సోమవారం ఉదయం భారీ కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 17 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. దాడికి పాల్పడింది ఎవరనేది తెలియదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటి వరకు ప్రకటించలేదు.
మధ్యాహం భోజనం విరామ సమయంలో బాగా హడావుడిగా ఉండే సమయంలో భారీ ఎత్తున పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ప్రాణ నష్టం, ఆస్తినష్టం భారీగానే పెరిగే అవకాశం ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈజిప్టులో వడగాలులు: 21 మంది మృతి
అరబ్ దేశమైన ఈజిప్టులో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. దేశంలో వీస్తున్న వడగాలుల కారణంగా ఇప్పటికే 21మంది మృత్యువాతపడగా, మరో 66మంది అస్వస్థతకు గురయ్యారు. ఈజిప్టు రాజధాని కైరోలోనే ఈ వడగాలుల కారణంగా 15మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఈజిప్టు వాతావరణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కైరోలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత, అప్పర్ ఈజిప్టు గవర్నరేట్స్‌లో 45డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లవద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ వడగాలులు ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగవచ్చని వారు తెలిపారు












Click it and Unblock the Notifications