బ్రెజిల్‌లో కూలిన డ్యామ్, 40 మంది మృతి: ఆ కంపెనీకి భారీ జరిమానా
బ్రాసిలియా: బ్రెజిల్‌లో ఓ వంతెన కూలి దాదాపు 40 మంది వరకు మృతి చెందారు. మరో మూడు వందల మంది గల్లంతయ్యారు. ఈ సంఘటన మినాస్ గెరియాస్ రాష్ట్రంలోని బెలో హొరిజొంటే నగరం సమీపంలో జరిగింది. స్థానిక పరావోపెబా నదిపై ఉన్న వంతెన శుక్రవారం నాడు కొట్టుకుపోయింది.
సమీపంలో ఇనుప ఖనిజం గనిని తవ్వుతున్న ఓ కంపెనీ ఆధ్వర్యంలో ఈ ఆనకట్ట ఉంది. దుర్ఘటన జరిగిన వెంటనే సమీప ప్రాంతాలను నీరు, బురద ముంచెత్తింది. దీని ఉధృతికి సమీపంలోని ఆ వంతెన కూలింది. ఎంతోమంది బురద, వరద నీటిలో చిక్కుకుపోయారు. దీంతో బాధితులను హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

గల్లంతైన వారిలో సదరు కంపెనీ ఉద్యోగులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కొన్ని నెలల క్రితమే జర్మనీకి చెందిన టుయెవ్ స్యూడ్ కంపెనీ ఈ ఆనకట్టను తనిఖీ చేసి ఎలాంటి లోపాలు లేవని చెప్పింది. ఆనకట్ట కూలిపోవడంతో దీనికి కారణంగా భావించి.. ఇనుప ఖనిజం తవ్వుతున్న సదరు కంపెనీపై బ్రెజిల్ పర్యావరణశాఖ శనివారం సుమారు రూ.462 కోట్ల భారీ జరిమానా విధించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications