వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో కనీవినీ ఎరుగని దారుణం - ఒకేసారి 4వేల పెంపుడు జంతువులు బలి - తిండి, నీరు లేక..

|
Google Oneindia TeluguNews

ప్రపంచమంతా వైరస్ విలయంతో విలవిల్లాడుతున్నా.. కరోనా పుట్టినిల్లయిన చైనాలో మొన్న జులైలో 'కుక్క మాసం వేడుకలు' గొప్పగా జరిగాయి. వేలాది శునకాలు చంపి తినడంపై జంతుకారుణ్యం సంస్థలు ఆందోళన వ్యక్తం చేసినా, చైనా సర్కారు పట్టించుకున్న పాపానపోలేదు. ముగజీవుల పట్ల, మరీ ముఖ్యంగా పెంపుడు జంతుల పట్ల డ్రాగన్ కిరాతకం మరోసారి బట్టబయలైంది. ఇప్పటిదాకా కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 4వేల జీవాలు బలైపోవడం సంచలనం రేపింది..

బీజేపీ అధ్యక్షుడి రాసలీలలు - కార్యకర్తతో నగ్న వీడియో - పోలీసుల బేరాలు - కరీంనగర్ ఘటనపై బండి ఫైర్ బీజేపీ అధ్యక్షుడి రాసలీలలు - కార్యకర్తతో నగ్న వీడియో - పోలీసుల బేరాలు - కరీంనగర్ ఘటనపై బండి ఫైర్

తిండి, నీరు లేక..

తిండి, నీరు లేక..

చైనాలో పెంపుడు జంతువుల ఆన్ లైన్ కొనుగోళ్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా కమ్యూనిస్టు సర్కారు అండతో వ్యాపారం యధేచ్ఛగా కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే సమాచార లోపం కారణంగా ఏకంగా 4 వేల పెంపుడు జంతువులు మృత్యవాత పడ్డాయి. తిండీ తిప్పలు లేక అలమటించి మరీ అవి కన్నుమూశాయి. చనిపోయిన 4 వేల జంతువుల్లో కుక్కలు, పిల్లులు, కుందేళ్లు ఇతర జంతువులు ఉన్నాయి. అసలేం జరిగిందంటే..

అంబానీని తలదన్నేలా కేసీఆర్ సంపద -మణికం ఠాకూర్ ఫైర్ -చస్తేనే దేవుడితో కొట్లాడగలమన్న జగ్గారెడ్డిఅంబానీని తలదన్నేలా కేసీఆర్ సంపద -మణికం ఠాకూర్ ఫైర్ -చస్తేనే దేవుడితో కొట్లాడగలమన్న జగ్గారెడ్డి

జంతువుల్ని పెట్టెల్లో కుక్కి..

జంతువుల్ని పెట్టెల్లో కుక్కి..


జనం ఆన్ లైన్ ద్వారా ఆర్డర్స్ చేసిన మేరకు.. వేలాది మూగజీవాలను ప్లాస్టిక్, కార్డుబోర్డు పెట్టెల్లో కుక్కి.. జంతు పరిశ్రమ నుంచి షిప్పుల ద్వారా పార్సిల్ చేశారు. అయితే, సదరు పార్సిల్ కు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడంలో లోపాలు తలెత్తాయి. జంతువుల పార్సిల్స్ తో కూడిన షిప్పు.. హెనాన్ ప్రావిన్స్‌లోని లౌహె నగరంలో గల డాంగ్‌షింగ్ లాజిస్టిక్స్ స్టేషన్‌ కు చేరుకున్న తర్వాత వాటి తరలింపుపై అందరూ నిర్లక్ష్యం వహించారు. దీంతో అవి వారం రోజులపాటు బాక్సుల్లోనే చిక్కుకుపోయి.. తిండి, నీరు, గాలి లేక అతిదారుణంగా చనిపోయాయి.

ఆ దృశ్యాలు భయానకం..

ఆ దృశ్యాలు భయానకం..

వేల కొద్దీ మూగజీవాలు లాజిస్టిక్ కేంద్రంలో చిక్కుకుపోయాయనే సమాచారం అందుకున్న వెంటనే యుతోపియా యానిమల్ రెస్క్యూ అనే సంస్థ రంగంలోక దిగింది. ఘటనా స్థలానికి వెళ్లగా అక్కడ భయానక దృశ్యాలు కనిపించాయి. పెట్టేల్లో కుక్కి ఉంచిన జంతువులు మృత్యువాత పడి, తీవ్రమైన దుర్వాసన వ్యాపించిందని, తాము అక్కడికి చేరుకునే సమయానికే 4 వేల జంతువులు చనిపోగా, మరో వెయ్యి కుందేళ్లు, ఎలుకలు, కుక్కలు, పిల్లుల్ని కాపాడి, వెటర్నరీ ఆస్పత్రికి తరలించామని యానిమల్ రెస్క్యూ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

Recommended Video

#BrahMos మిసైల్‌ With Homemade Parts, India Successfully Tests Extended Range || Oneindia Telugu
చైనాలో మూగజీవాలకు నిత్యనరకం..

చైనాలో మూగజీవాలకు నిత్యనరకం..


షిప్పింగ్ సంస్థకు, స్థానిక ప్రతినిధులకు మధ్య సమాచార లోపం తలెత్తడం వల్ల వేల కొద్దీ మూగ జీవాలు ఊపిరి ఆడక, నీళ్లు లేక, ఆకలితో అలమటించి చనిపోయాయని యుతోపియా జంతుకారుణ్య సంస్థ వ్యవస్థాపకురాలు హువా ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో వాటిని రవాణా చేసిన తీరు చాలా భయంకరంగా ఉందని, ఆన్‌లైన్‌లో పెంపుడు జంతువుల విక్రయాలపై నియంత్రణ లేదన్న విషయం మరోసారి రుజువైందని ఆమె తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

English summary
In a horrific tragedy, about 4,000 dogs, cats, rabbits and other animals, believed to have been bought online as pets, were found dead in boxes in China. The animals had all been held in plastic or metal cages wrapped in cardboard boxes at a shipping facility where they were stranded for nearly a week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X