పాకిస్థాన్ జైలులో 403 మంది భారతీయులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని అనేక జైళ్లలో 403 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం వెల్లడించింది. అందులో 355 మంది జాలర్లు ఉన్నారని స్పష్టం చేసింది. మిగిలిన వారు పౌరులు అని వెల్లడించింది.
అదే విధంగా భారత్ లోని వివిద జైళ్లలో పాకిస్థాన్ కు చెందిన 278 మంది ఖైదీలుగా ఉన్నారని భారత విదేశాంగ కార్యాలయం వెల్లడించింది. అందులో 251 మంది పౌరులు ఉన్నారని, మిగిలిన 27 మంది జాలర్లు అని భారత విదేశాంగ కార్యాయలం వర్గాలు తెలిపాయి.

అయితే పాక్ మాత్రం కొత్త పాట పాడుతున్నది. భారత్ అందించిన 278 మంది ఖైదీల జాబితాను పరిశీలించింది. తమ లెక్కల ప్రకారం భారత్ లో 398 మంది ఖైదీలు ఉన్నారని ఆరోపిస్తున్నది. అందులో 120 మంది పేర్లు గల్లంతు అయ్యాయని వారి వివరాలు ఇవ్వాలని అంటున్నది.
ఈ పూర్తి వివరాలు తమకు కావాలని పాక్ హోం మంత్రిత్వ శాఖ డిమాండ్ చేస్తున్నది. 2008 మే 21వ తేదిన భారత్, పాక్ దేశాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఇరు దేశాలలో ఉన్న ఖైదీల వివరాలను జనవరి 1, జులై 1వ తేదిన పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించారు. అప్పటి నుండి ఖైదీల వివరాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications