బాగ్దాద్‌లో ఐఎస్ మారణహోమం: 43మంది మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదులు మారణహోమం నిర్వహించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఐఎస్‌ జరిపిన బాంబు దాడుల్లో సుమారు 43 మంది ప్రాణాలు కోల్పోయారు.

బాగ్దాద్‌లోని ఓ వాణిజ్య సముదాయం ముందు ఐఎస్‌ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి.. 18 మందిని పొట్టనబెట్టుకున్నారు. మరికొందరు ఉగ్రవాదులు వాణిజ్య సముదాయంలో దాక్కోవడంతో భద్రతా బలగాలు భవనం పైనుంచి లోపలికి ప్రవేశించి ముష్కరులను కట్టడి చేశాయి.

43 killed in Baghdad terror attack

ఈ ప్రయత్నంలో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు పోలీసులకు పట్టుబట్టారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్‌ ప్రకటించింది. తొలుత ఈ వాణిజ్య భవనంలో 50 మందిని బందీలుగా ఉంచారని పోలీసులు భావించారు.

అందులోకి ప్రవేశించిన తర్వాత ఎవరూ బందీలుగా లేరని గుర్తించారు. మరో ఘటనలో ఆగ్నేయ బాగ్దాద్‌లోని రద్దీగా ఉండే మార్కెట్‌లో కారు బాంబు పేల్చడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకో ఘటనలో హోటల్‌వద్ద బాంబు దాడికి పాల్పడటంతో సుమారు 20 మంది మృతిచెందినట్లు అక్కి అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+