వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో మునిగిపోయిన నౌక: 450 మంది గల్లంతు

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలో తుఫాన్ రావడంతో నౌక మునిగిపోయి 450 మంది గల్లంతు అయ్యారు. చైనా నౌకా దళం అధికారులు కేవలం ఎనిమిది మందిని మాత్రం కాపాడగలిగారు. గల్లంతు అయిన వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

చైనాలోని యాంగ్జీ నది మీదుగా ఈస్టెన్ స్టార్ అనే నౌక బయలుదేరింది. అందులో 405 మంది ప్రయాణికులు, 47 మంది నౌకా సిబ్బంది, ఐదుగురు ట్రావెల్ ఏజెన్సీకి చెందిన వారు ఉన్నారు. సోమవారం రాత్రి నది మధ్యలో నౌక వెళుతున్న సమయంలో తుఫాను వచ్చింది.

తుఫాన్, పెనుగాలులలో నౌక చిక్కుకుంది. ఆ సందర్బంలో నౌక నదిలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న చైనా నౌకా దళం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నౌకలో ఉన్న కెప్టెన్, చీఫ్ ఇంజనీరుతో సహ కేవలం 8 మందిని రక్షించారు.

450 people capsized on the Yangtze River in China's Hubei province

తుఫాను తీవ్రత ఎక్కవ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని, గల్లంతు అయిన వారి కోసం గాలిస్తున్నామని అధికారులు అంటున్నారు. ఆసియా ఖండంలోనే అతి పోడవైన నదిగా పేరొందిన చైనాలోని యాంగ్జీ నదిలో నౌక మునిగిపోవడంతో చైనా ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది.

దక్షిణ చైనా నుండి చోంక్వింగ్ కు నౌక వెలుతున్న సమయంలో మార్గం మధ్యలో ప్రతికూల వాతవరణం ఎదురై తుఫాన్, పెనుగాలుల తాకిడికి నౌక మునిగిపోయిందని చైనా అధికారిక మీడియా జిన్ హూవా స్పష్టం చేసింది.

English summary
The captain and the chief engineer, who were both rescued, have been detained by police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X