వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూరప్ ట్రిప్‌కు వెళ్తున్నారా?: 5 చూడదగ్గ దేశాలివే (ఫోటోలు)

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

ప్రయాణం చేయడం అంటే చాలా మందికి ఇష్టం. కొందరికి బైక్‌పై దేశం మొత్తం చుట్టేయాలని అనిపిస్తే, మరికొందరికి సముద్రాలను దాటి అవతల ఉన్న దేశాలను చుట్టేయాలనే భావన ఉంటుంది. అలా ప్రపంచంలో చూడదగ్గ అత్యుత్తమ సందర్శన ప్రదేశాలు కలిగి ఉన్న ఖండంగా యూరప్ ఖండం పేరుగాంచింది.

ప్రపంచంలో అత్యంత సుందమైన ప్రదేశాలు యూరప్‌లోనే ఉండటం విశేషం. జీవితంలో ఒక్కసారైనా యూరప్ ట్రిప్‌కు వెళ్లాలని కలలు కనేవారు అనేకం. యూరప్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే రోలర్ కోస్టర్. సెలవులను ఎంజాయ్ చేయాలన్నా, ఏదైనా సాహసం చేయాలన్నా టూరిస్టులందరూ ఇక్కడికే వెళుతుంటారు.

అలాంటి యూరప్ ఖండం అనేక దేశాల సమాహారం. యూరప్‌లో మొత్తం 28 దేశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా వేటికి అవే ప్రత్యేకం. అయితే యూరప్‌లో కూడా అన్ని దేశాలను సందర్శించడం ఎంతో కష్టం కూడుకున్న పని. అందుకే పాఠకుల కోసం ప్రత్యేకంగా యూరప్‌లోని ఐదు అత్యుత్తమ సందర్శన దేశాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం.

1. స్విట్జర్లాండ్

వేసవిలో భారత్‌లోని వేడిని తట్టుకోలేని చాలా మంది పర్యాటకులకు స్విట్జర్లాండ్ అత్యుత్తమ గమ్యం. కోమలమైన ఆల్పైన్ పచ్చిక ప్రాంతాలు, మంచుతో కప్పబడిన పర్వతాలు స్విట్జర్లాండ్ ప్రత్యేకం. భూతల స్వర్గంగా పేరుగాంచింది. స్విట్జర్లాండ్‌ సందర్శన పర్యాటకుల ఎంపికను ఓ మంచి నిర్ణయం. స్విస్‌లో బాగా ప్రాచుర్యం పొందిన రోతార్న్ రిసార్ట్స్ సందర్శన మంచి అనుభవనాన్ని అందిస్తుంది. దీనికి తోడు అక్కడ రాక్ క్లైంబింగ్, హెలి-స్కీయింగ్, పారాగ్లైడింగ్ మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

తప్పక చూడాల్సిన ప్రదేశాలు: Jungfraujoch- Ice Palace, Sphinx Observatory; Mount Titlis- Titlis Gondola, Titlis Cliff Walk; Zermatt- Zweisimmen, Montreux, Mont Blanc, Lake Brienz, Geneva Lake; Interlaken.

5 countries in Europe that you must be on your travel list of 2016

2. యునైటెడ్ కింగ్‌డమ్

ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, నార్తర్న్ ఐస్‌ల్యాండ్ ఐదు దేశాల సమాహారమే యునైటెడ్ కింగ్‌డమ్. పర్యాటకులకు ఇంగ్లాండ్ ఒక గొప్ప ఎంపిక. ప్రోటోకాల్, అనుగుణ్యత ప్రేమను చూపడంలో యునైటెడ్ కింగ్‌డమ్ ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. అధునాతన సంప్రదాయ పద్ధతిలో నిర్మించిన ఇక్కడి భవంతులు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఏ పర్యాటకుడుకైనా యూకే అనేది వన్-స్టాప్-షాప్. యూకే ప్రధాన నగరం లండన్.

తప్పక చూడాల్సిన ప్రదేశాలు: London- Buckingham Palace, Palace of Westminster, St Paul's Cathedral, London Eye, Madam Tussauds; Edinburgh- Edinburgh Castle, Mons Meg; Belfast- Grand Opera House, Belfast Castle; Glasgow- Glasgow University, Bell's Bridge, Riverside Museum

5 countries in Europe that you must be on your travel list of 2016

3. గ్రీస్

యూరప్‌లో రొమాంటిక్‌ పర్యటనను చేయాలనుకునే పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే నగరాల్లో ఇదొకటి. సన్నీ బీచ్లు, స్వచ్ఛమైన ద్వీపాలు, అద్భుతమైన నిర్మాణాలు గ్రీసు సొంతం. ప్రాచీన నాగరికతగా పెట్టింది పేరు ఈ దేశం. గ్రీసు దేశంలో ఒకవైపు భాగంలో ద్వీపం ఉండగా, మరోవైపు కప్పబడిన పర్వతాలు ఉండటంతో విరుద్ధంగా కనిపిస్తుంది.

తప్పక చూడాల్సిన ప్రదేశాలు: Santorini; Athens- Syntagma Square, Parliament, Academy, Memorial to the Unknown Soldier, Parthenon, Delphi- Temple of Apollo, Athenian Treasury, Altar of the Chians; Olympia- Temple of Zeus, Temple of Hera, Metroon; Mykonos- Paradise Beach, Mykonos Castle; Parnassos.

5 countries in Europe that you must be on your travel list of 2016

4. ఫ్రాన్స్

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అద్భుతమైన కట్టడాలను కలిగి ఉన్న దేశాల్లో ఇదొకటి. ప్రపంచానికి ఫ్యాషన్ నడవడికను నేర్పింది ఈ నగరమే. UNESCO గుర్తించిన అత్యంత ప్రాచీనమైన నగరాల్లో 'సిటీ ఆఫ్ లవ్'గా పిలుచుకునే పారిస్ ఇక్కడే ఉంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్. ఈ దేశంలో సందర్శనీయ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు ఫ్రాన్స్‌లో పర్యటించే పర్యాటకులు ఇక్కడే లభించే భోజనాన్ని తప్పక రుచి చూడాలి. ప్రపంచంలోనే అద్భుతమైన రెస్టారెంట్స్ ఈ దేశంలో ఉన్నాయి.

తప్పక చూడాల్సిన ప్రదేశాలు: Paris- Eiffel Tower, Musée d'Orsay, Louvre Museum, Notre Dame de Paris, Arc de Triomphe, Palais Garnier, Palace of Versailles, Chartres Cathedral, and Champs-Élysées.

5 countries in Europe that you must be on your travel list of 2016

5. జర్మనీ

రెండో ప్రపంచ యుద్ధానికి నాంది పలికింది ఈ దేశం. 82 మిల్లియన్ల నివాసితులతో ఐరోపా సమాఖ్యలోని సభ్యదేశాలలో అధిక జనాభా గల దేశం. రొమాన్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ పరంగా ప్రపంచంలో ఎక్కువ మంది పర్యాటకులను ఆకట్టుకునే దేశాల్లో ఆరో స్ధానంలో నిలిచింది. లవర్స్ టూరిస్ట్ స్పాట్‌గా జర్మనీకు పేరుంది. సంవత్సం మొత్తం ఏదో ఒక ఫెస్టివల్‌ను ఇక్కడి ప్రజలు జరుపుతూనే ఉంటారు. జర్మీలో జరిగే 'ఓక్టోబర్‌ఫెస్ట్'కు ప్రపంచంలోని నలుమూలల నుంచి పర్యాటకులు హాజరవుతుంటారు.

తప్పక చూడాల్సిన ప్రదేశాలు: Berlin- WWII Battlefields, Brandenburg Gate, Reichstag building, Memorial to the Murdered Jews of Europe, Checkpoint Charlie; Munich- Nymphenburg Palace, Hofbräuhaus München, Neuschwanstein Castle; Bavaria- Deutsches Museum, Munich Residenz, Alte Pinakothek; Frankfurt- Goethe House, Alte Oper, Naturmuseum Senckenberg, Frankfurt Cathedral.

5 countries in Europe that you must be on your travel list of 2016
English summary
If Ibn Battuta's quote, 'traveling, it leaves you speechless then turns you into a storyteller' is anything to go by, Europe is the story waiting to be told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X