ఎయిర్ పోర్టులో దుండగుడి కాల్పులు, 5గురి మృతి, అరెస్ట్
ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్ విమానాశ్రయంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో అయిదుగురు మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
ఫ్లోరిడా: ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్ - హాలీవుడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో అయిదుగురు మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.

రెండో టెర్మినల్ వద్ద లగేజీ తనిఖీ ప్రాంతంలో శుక్రవారం నాడు ఈ ఘటన జరిగింది.. కాల్పుల ఘటన నేపథ్యంలో విమానాశ్రయంలోని ప్రయాణికులను అధికారులు ఖాళీ చేయించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
విషయం తెలియగానే సంఘటన స్థలానికి అధికారులు, భద్రతా సిబ్బంది చేరుకుంది. పలువురు మృతి చెందారని, ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిని కస్టడీకి తీసుకున్నామని ఓ అధికారి తెలిపారు.

లగేజీ తనిఖీ చేసే టెర్మినల్ 2 ప్రాంతంలో సంఘటన జరిగినట్లుగా ఎయిర్ పోర్ట్ అధికారులు ట్వీట్ చేశారు. తాత్కాలికంగా విమానాశ్రయంలో అన్ని సర్వీసులు మూసేస్తున్నట్లు తేలిపారు. ప్రయాణీకులు తమ తమ ఎయిర్ కారియర్స్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చన్నారు.
బ్రోవార్డ్ కంటీ కమిషనర్ మాట్లాడుతూ.. ఎయిర్ పోర్టులో షూట్ చేసిన వ్యక్తి కెనడియన్ ఫ్లైట్‌లో వచ్చిన ప్రయాణీకుడు అని తేలిందన్నారు. అథారిటీ చెక్ చేసినప్పుడు అతడి బ్యాగులో గన్ కనిపించిందన్నారు. ఇది టెర్రర్ అటాక్ అని అప్పుడే చెప్పలేమన్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications