వరదల బీభత్సం: 50 మంది దుర్మరణం (వీడియో)
కొలంబియా: కొలంబియాలో వరదల బీభత్సానికి 50 మంది జలసమాధి అయ్యారు. అనేక మంది వరద నీటిలో కొట్టుకుని వెళ్లి గల్లంతు అయ్యారు. పలుచోట్ల ఇండ్లు నేలమట్టం కావడంతో స్థానికులు నడిరోడ్డు మీద నిలబడ్డారు. సహాయం చెయ్యాలని ఆర్తనాదాలు చేస్తున్నారు.
కొలంబియా అధ్యక్షుడు జువాన్ మానుల్ సాంటోస్ అధికారులతో సంప్రదించి వరద బాధితులను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంలో సాంటోస్ స్థానిక మీడియాతో మాట్లాడారు. వరద నీటిలో గల్లంతు అయిన వారి ఆచూకీ తెలియడం లేదని గాలిస్తున్నామని అన్నారు.
పూర్తిగా ఇండ్లు కొల్పోయిన వారికి తాము పునరావాసం కల్పిస్తున్నామని, వారికి ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా లిబోరియానా నది ఉదృతంగా ప్రవహించడంతో మట్టి పెల్లలు విరిగిపడి చాలా మందికి గాయాలయ్యాయి.

క్షతగాత్రులను రక్షించడానికి రెస్య్కూ టీంలు శ్రమిస్తున్నాయి. వరదలు వచ్చిన కొలంబియా నార్త్- ఈస్ట్ ప్రాంతాలను కొలంబియా అధ్యక్షుడు సాంటోస్ సందర్శించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications