ఇండోనేషియాలో బలమైన భూకంపం: 6.1గా తీవ్రత నమోదు, పరుగులు తీసిన జనం
జకార్తా: ఇండోనేషియాలో సోమవారం భారీ భూకంపం చోటు చేసుకుంది. పశ్చిమ ఇండోనేషియాలోని నియాస్ రీజియన్, సుమత్రా ద్వీపంలో సోమవారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది భయాందోళనలకు గురైన నివాసితుల ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం భవనాలను వణికించినప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు.
భూకంప కేంద్రం ఉత్తర సుమత్రాలోని పడంగ్‌సిడెంపువాన్ నగరానికి నైరుతి దిశలో 84 కిలోమీటర్ల (52 మైళ్లు) లోతులో సముద్రంలో ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదించింది. ఈ భూకంపం సోమవారం రాత్రి 9:59 (1459 GMT) సమయంలో జరిగింది.

భూ ప్రకంపనల తర్వాత సునామీ హెచ్చరికలు ఏమీ లేవని, అయితే భూకంప కేంద్రానికి సమీపంలోని నివాసితులకు సంభావ్య అనంతర ప్రకంపనల గురించి జాగ్రత్త వహించాలని దేశ వాతావరణ శాస్త్రం, జియోఫిజిక్స్ ఏజెన్సీ అప్రమత్తం చేసింది.
ప్రధాన ఇండోనేషియా మీడియా సంస్థలు కూడా ఆస్తి నష్టం లేదా గాయాల గురించి తక్షణ నివేదికలను అందించలేదు. కానీ, కొంతమంది నివాసితులు తమ ఇళ్లు కంపించినట్లు తెలిపారు.
"భూకంపం చాలా బలంగా ఉంది. ఇది సాధారణమైన వాటిలా కాదు. ఈసారి మా ఇల్లు బలంగా కంపించింది. అని స్థానికులు తెలిపారు. కాగా, పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" స్థానం కారణంగా తరచుగా ఇండోనేషియాలో భూకంపాలు సంభవిస్తాయి. అగ్ని పర్వతాలు కూడా ఇక్కడ తరచూ పేలుతుంటాయి.












Click it and Unblock the Notifications