సమాధుల కోసం: ఆరుగురు వృద్ధుల ఆత్మహత్య!
బీజింగ్: చైనాలో నెలకొన్న ఓ కొత్త సమస్య కారణంగా ఆరుగురు వృద్ధులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు తమ శవాలను కాల్చేయకండి.. పూడ్చివేసి సమాధులను కట్టండని ఓ లేఖ రాసి మరీ చనిపోయారు. తాము జూన్ 1 కంటే ముందే చనిపోతున్నాం కాబట్టి తమ శవాలను కాల్చకూడదని కోరారు.
అసలు సమస్యేంటంటే.. చైనాలో మృతులను ఖననం చేయడం, వారి జ్ఞాపకార్థం సమాధులను కట్టడం ఆచారం. తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. అయితే జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో చనిపోయిన వారందర్నీ పూడ్చి పెట్టడం వల్ల దేశంలోని ఎక్కువ భూభాగం వాటికి కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదే విధానం కొనసాగితే దేశంలో చాలా భూభాగం సమాధులకే కేటాయించాల్సి వస్తుందని ఆలోచించిన చైనా ప్రభుత్వం.. జూన్ 1 తర్వాత చనిపోయిన వారికి సమాధులు కట్టడానికి వీల్లేదని చట్టం చేసింది. ఈ వార్త విన్న ఆరుగురు వృద్ధులు తమకు సమాధులుండవేమోనని భయపడ్డారు. జూన్ 1 లోపే చనిపోతే తమకు సమాధాలుంటాయని భావించి.. మే 28నే ఈ ఆరుగురు వృద్ధులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆ విషాధ ఘటన అన్‌హాయ్ ప్రాంతంలోని ఆంకింగ్ నగరంలో చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో 83ఏళ్ల ఝెంగ్ షిఫాంగ్ అనే వృద్ధ మహిళ ముందుగానే తన శవపేటికను తయారు చేయించుకున్నారు. అయితే ప్రభుత్వ కొత్త చట్టం ప్రకారం అధికారులు ఆ శవపేటికను ధ్వంసం చేశారు. దీంతో ఆవేదనకు గురైన ఆమె కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మరో మహిళ బావిలో దూకి చనిపోగా.. మిగితా నలుగురు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.












Click it and Unblock the Notifications