ముంబై మారణకాండ మాస్టర్‌మైండ్ హఫీజ్ సయీద్‌పై కేసు కొట్టివేత: ఇంకేం చేస్తాడో..?
ఇస్లామాబాద్: ముంబై మారణకాండ. దేశ ఆర్థిక రాజధానిపై 2008లో చోటు చేసుకున్న ఈ ఉగ్రవాది.. ప్రపంచం మొత్తాన్నీ నివ్వెరపోయేలా చేసింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ప్రోత్సాహిత లష్కరే తొయిబాకు చెందిన తొమ్మిదిమంది సూసైడ్ స్క్వాడ్ నిర్వహించిన ఈ దాడుల్లో 170 మందికి పైగా సాధారణ పౌరులు, పోలీసులు మరణించారు. పలువురు గాయపడ్డారు. తాజ్ హోటల్, ట్రైడెంట్ ఓబెరాయ్, ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, లెపార్డ్ కేఫ్, రెండు ఆసుపత్రులు, నారిమన్ హౌస్ వంటి ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులు జరిపారు.

ముంబై దాడులకు మాస్టర్‌మైండ్..
ఈ మారణహోమానికి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్. ముంబైపై దాడి చేయడానికి లష్కరే తొయిబాకు పెద్ద ఎత్తున నిధులను సమకూర్చాడు. ఆయుధాలను సమకూర్చాడు. మాస్టర్‌మైండ్‌గా మారాడు. ఈ తొమ్మిదిమంది ఉగ్రవాదుల్లో కసబ్‌ను పోలీసులు ప్రాణాలతో పట్టుకోగలిగారు. అతణ్ని ఇంటరాగేట్ చేయడంతో ఈ సమాచారం మొత్తం బయటికి వచ్చింది. దీన్ని సాక్ష్యాధారాలుగా చూపించిన అప్పటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి ద్వారా పాకిస్తాన్‌పై ఒత్తిళ్లను తీసుకొచ్చింది.

జమాత్ దవా నిషేధిత జాబితాలో..
హఫీజ్ సయీద్ చీఫ్‌గా వ్యవహరిస్తోన్న జమాత్-ఉద్-దవా సంస్థను నిషేధించేలా చేసింది. దీని తరువాత ప్రపంచ దేశాలన్నీ జమాత్-ఉద్-దవాను నిషేధిత ఉగ్రవాద సంస్థల జాబితాలోకి చేర్చాయి. లష్కరే తొయిబా, జైషె మహ్మద్ వంటి ఉగ్రవాద గ్రూపులు, సంస్థలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నాడనే కారణంతో- పాకిస్తాన్ ప్రభుత్వంపై కూడా జమాత్-ఉద్-దవాపై ఆంక్షలను విధించింది. హఫీజ్ సయీద్‌తో పాటు మరో అయిదుమందిపై గత ఏడాది కేసు నమోదు చేసింది.

హఫీజ్ సయీద్‌కు విముక్తి..
ఈ కేసులపై లాహోర్ హైకోర్టు విచారణ కొనసాగించింది. తాజాగా దీన్ని ముగించింది. ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూర్చుతున్నాడంటూ కేసులను ఎదుర్కొంటోన్న హఫీజ్ సయీద్‌కు విముక్తి కల్పించింది. అతనితో పాటు ప్రొఫెసర్ మాలిక్ జాఫర్ ఇక్బాల్, జమాత్ ఉద్ దవా అధికార ప్రతినిధి యాహ్యా ముజాహిద్, సమీవుల్లా, ఉమర్ బహదూర్, హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కిలపై నమోదైన కేసులను కొట్టివేసింది.

సాక్ష్యాధారాలు లేకపోవడం వల్లే..
లాహోర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహ్మద్ అమీర్ భట్టి, జస్టిస్ తారిఖ్ సలీమ్ షేక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువడించింది. ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూర్చుతున్నారనడానికి సరైన సాక్ష్యాధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలం అయ్యారని వ్యాఖ్యానించింది. సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన కౌంటర్ టెర్రరిజమ్ డిపార్ట్‌మెంట్ ఈ కేసుపై దర్యాప్తు చేసింది.
Recommended Video

మరో ఉగ్రవాద సంస్థపై నిషేధం
సాక్ష్యాధారాలను సమర్పించలేకపోవడంతో జమాత్ దవాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది లాహోర్ హైకోర్టు. కాగా- ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తెహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో ఏర్పాటైన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఏఆర్‌వై న్యూస్ తెలిపింది. ఆ సంస్థకు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలను నిషేధిత జాబితాలో చేర్చినట్లు పేర్కొంది
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications