ప్రకృతి విలయం: 60 మంది దుర్మరణం..41 మంది మిస్సింగ్: తుడిచి పెట్టుకుపోతున్న గ్రామాలు
ఖాట్మండు: హిమాలయన్ కంట్రీ నేపాల్‌లో ప్రకృతి ప్రకోపించింది. విలయాన్ని సృష్టించింది. భారీ వర్షాలు.. నేపాల్ పశ్చిమ ప్రాంతాన్ని ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదల వల్ల ఒకదాని వెంట ఒకటిగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. గ్రామాలకు గ్రామాలను తుడిచి పెట్టేస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనలో నేపాల్‌లో ఇప్పటిదాకా 60 మంది మృత్యువాత పడ్డారు. 41 మందికి పైగా అదృశ్యం అయ్యారు. వారంతా మరణించి ఉండొచ్చనే అనుమానాలు ప్రాథమికంగా వ్యక్తమౌతున్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. అధికారలు వారికి పునరావసాన్ని కల్పించారు.
నేపాల్‌లో నాలుగు రోజులుగా ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల వల్ల వరదలు సంభవిస్తున్నాయి. నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని మ్యాగ్డీ జిల్లాపై ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. వరదల వల్ల మ్యాగ్డీ జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఈ ఒక్క జిల్లాలోనే 27 మంది మరణించారు. పలువురు గల్లంతు అయ్యారు. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఫలితంగా బురదతో కూడుకున్న వరదలు సంభవిస్తున్నాయి. పర్వతాలతో నిండి ఉన్న ఈ జిల్లాలో అత్యధిక గ్రామాలు పర్వత సానువుల్లో ఉన్నవే.

భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటంతో ఆయా గ్రామాలన్నీ మట్టికొట్టుకునిపోతున్నాయి. తుడిచి పెట్టుకునిపోతున్నాయి. మరోవంక అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. బురద, విరిగిపడిన కొండ చరియలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు వెలికి వస్తున్నాయి. ఇప్పటికే 60 మృతదేహాలను వెలికి తీసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. మ్యాగ్డీ జిల్లాలోని ధౌలాగిరిలో రెండు వీధుల్లో ఎనిమిది అడుగుల ఎత్తున బురద పేరుకునిపోయిందని అధికారులు తెలిపారు. వాటిని తొలగిస్తున్నామని చెప్పారు. నిరాశ్రయాలకు పునరావసాన్ని కల్పించినట్లు చెప్పారు.

కొండచరియలు విరిగిన పడినలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా అధికారులు అనుమానిస్తున్నారు. 41 మందికి పైగా గల్లంతు అయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. మ్యాగ్డీకి ఆనుకునే ఉన్న జిల్లాల్లోనూ ఇవే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా.. మున్ముందు మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు నేపాల్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా కొండచరియలు విరిగి పడే అవకాశం ఉన్న గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. వారి కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు.
Recommended Video
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications