వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేరెంట్స్ తస్మాత్ జాగ్రత్త: ఈ చిన్నారి ఏం మింగాడో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

చైనా: చైనాలో ఓ ఆరేళ్ల బాలుడికి అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు వైద్యులు. తల్లిదండ్రులు లేని సమయంలో ఆ బాలుడు ఏకంగా 61 ఐస్కాంతం బాల్స్‌ను మింగేశాడు. ఇక ఆ తర్వాత క్రమంగా కడుపు నొప్పి వేస్తుండటంతో తల్లిదండ్రులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. మింగిన వెంటనే ఎలాంటి కడుపు నొప్పి అతనికి కలగలేదు. క్రమంగా అంటే ఆరుగంటలకు కడుపు విపరీతమైన నొప్పి కలగడంతో తల్లిదండ్రులకు చెప్పాడు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కుర్రాడి కడుపులో ఏదో చిన్న బంతుల్లాంటివి ఉండటం గమనించారు. వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.

చిన్నారికి స్కానింగ్ చేయగా కడుపులో ఏదో హారంలాంటి వస్తువు కనుగొన్నట్లు డాక్టర్ క్సుబో చెప్పారు. ఏమైనా మింగావా అని డాక్టర్ ప్రశ్నించగా అందుకు అబ్బాయి అవునని సమాధానం ఇచ్చాడు. చిన్నారి ఆడుకునేందుకు 64 మేగ్నిటిక్ బంతులను కొనుగోలు చేయగా అందులో 61 బాల్స్‌ను మింగినట్లు డాక్టర్ తెలిపాడు. దీంతో మూడు గంటలపాటు ఆపరేషన్ చేసి మింగిన ఐస్కాంతం బాల్స్‌ను మొత్తాన్ని తొలగించివేసినట్లు చెప్పారు. బాల్స్ అతని పేగులకు ఏమైనా హాని కలిగించి ఉంటాయన్న అనుమానంతో చిన్న పేగును అపెండిక్స్‌ను తొలగించాల్సి వచ్చిందని డాక్టర్ క్సుబో చెప్పారు.

61 magnetic beads swallowed by Chinese boy, doctors remove after surgery

ఇక ఆపరేషన్ ఆలస్యం అయి ఉండి ఉంటే బాలుడి ప్రాణాలకే ప్రమాదంగా మారేదని చెప్పారు. ఆ ఐస్కాంతం బంతులు పేగులను ధ్వంసం చేసేవని డాక్టర్లు పేర్కొన్నారు. అందుకే పిల్లలకు ఆడుకునేందుకు ఐస్కాంతంతో తయారయ్యే ఉత్పత్తులను కొనివ్వరాదని వైద్యులు సూచిస్తున్నారు. వాటిని పిల్లలు తెలియకుండా నోట్లో పెట్టుకుని మింగేసి ఏకంగా ప్రాణాలమీదకు తెచ్చుకుంటారని హెచ్చరిస్తున్నారు. 2008లో అమెరికా కన్స్యూమర్ ప్రాడక్ట్ సేఫ్టీ కమిషన్ స్టాండర్డ్స్‌ను మార్చింది. అందులో మేగ్నిటిక్ టాయ్స్‌ను తొలగించింది. ఐస్కాంతంతో కూడిన వస్తువులు మింగడం ద్వారా సరైన అరుగుదల లేక చాలామందికి ఎన్నో సర్జరీలు నిర్వహించాల్సి వచ్చిందని అమెరికన్ అకాడెమీ ఆఫ్ పీడియాట్రీషియన్స్ సంస్థ తెలుపుతోంది.

English summary
A 6-year-old boy in China landed in the hospital after he swallowed more than 60 magnetic balls while his parents weren’t looking. The boy, who was not named by news outlet AsiaWire, had reportedly been experiencing intense stomach pains before he was taken to the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X