మెక్సికోలో భూకంపం, ఐదుగురి మృతి, పలువురికి గాయాలు
మెక్సికో: మెక్సికోలో మంగళవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంబవించింది. రిక్టర్‌స్కేల్‌పై 7.1 భూకంపతీవ్రత నమోదైంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురు మృతి చెందినట్టు సమాచారం.
శాన్ జ్యాన్ రాబోసోకు 55కి.మీ దూరంలోని పుబియా పట్టణానికి సమీపంలో కేంద్రీకృమైందని అధికారులు గుర్తించారు. మెక్సికో సిటీ భూకంప కేంద్రం సుమారు 51కి.మీ దూరంలో ఉంటుంది.

ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు. మెక్సికోలోని ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు. పుబియా పట్టణంలో పలు భవనాలు కుప్పకూలాయి.
భూకంపం భయంతో ప్రజలు ఇళ్ళ నుండి బయటకు పరుగులు తీశారు. సహయకచర్యలను ప్రభుత్వంచేపట్టింది. అయితే రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications