చైనాలో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో ప్రకంపనాలు.. ఇద్దరు మృతి

చైనాలో భారీ భూకంపం సంభవించింది. చైనాకు వాయవ్యలో గల కింగాయ్ ప్రావిన్స్‌లో భూమి కంపించింది. శనివారం తెల్లవారుజామున భూకంపం వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. నైరుతి దిశలో కూడా మరో భూకంపం వచ్చిందని.. దీంతో ఇద్దరు చనిపోయారని వెల్లడించింది.

 ap cm ys jagan meets home minister amith shah

భూకంప కేంద్రం కింగాయ్ అని గుర్తించారు. చైనా కాలామానం ప్రకారం అర్ధరాత్రి 2 గంటలకు భూమి కంపించింది. దాని తీవ్రత 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రభావం చూపించింది. జిన్ జింగ్‌పై కూడా భూకంప ప్రభావం ఉందని అమెరికా సిస్మొలాజిస్టులు తెలియజేశారు.

Recommended Video

    #TOPNEWS : Uttarakhand Earthquake | China Releases Galwan Clash Video | #IndiaChinaStandoff

    మరోవైపు యున్నాన్‌లో 6.1 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ఒకరు చనిపోయారని స్థానిక అధికారులు రిపోర్ట్ చేశారు. మరో ముగ్గురు శిథిలాల్లో చిక్కుకున్నారని తెలిపారు. భూ ప్రకంపనాలు రాగానే జనం ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని భవనాలు కూలిపోయామని.. మరికొన్ని దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భూకంపం నేపథ్యంలో ఇళ్లలో ఉండొద్దని.. బయటకు రావాలని అధికారులు ప్రజలను కోరారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+