వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

700 మంది మృతి..18 ర్యాలీలతో ఎఫెక్ట్.. అంతా ట్రంపే చేశారంటోన్న సర్వే...?

|
Google Oneindia TeluguNews

మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల వేళ.. విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోన్న ప్రచారం కొనసాగించారు ట్రంప్, బిడెన్. అయితే ట్రంప్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. తర్వాత కోలుకున్న తర్వాత క్యాంపెయిన్ కొనసాగించారు. అమెరికన్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.

 700 deaths resulted due 18 trump rallies..

అధ్యక్ష ఎన్నికల కోసం ట్రంప్ చాలా ర్యాలీలు తీశారు. అయితే అందులో సామాజిక దూరం పాటించలేదు. కొన్నిచోట్ల మాస్క్‌లు కూడా కనిపించలేదు. ట్రంప్ పాల్గొన్న 18 ర్యాలీలతో కరోనా కేసులు కాదు.. మరణాలకు దారితీసింది. జూన్ 20వ తేదీ నుంచి సెప్టెంబర్ 22 వరకు ట్రంప్ ర్యాలీలు తీశారు. అందులో 30 వేల మంది వరకు వైరస్ సోకింది. ఇందులో 700 మంది చనిపోయారని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ సర్వేలో వెల్లడించింది. ఎన్నికల వేళ ఇదీ ట్రంప్‌నకు మింగుడు పడని అంశంగా మారింది.

వైరస్‌ వ్యాప్తిని ఏమాత్రం లెక్కచేయకుండా నిబంధనలు ఉల్లంఘించిన ప్రచార ర్యాలీలు నిర్వహించడం కారణంగానే పౌరులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. స్టాన్ ఫోర్డ్ వర్సిటీ రిపోర్టుపై డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిబెన్‌ స్పందిచారు. అమెరికన్ల ప్రాణాలపై ట్రంప్‌కు ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. బాద్యతాయుతమైన పదవీలో ఉండి.. ఇదేం పని అని విరుచుకుపడ్డారు.

English summary
700 deaths resulted due 18 trump rallies in united states of america in corona time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X